Beauty Tips:ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారికి వరకు అందరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవటం, బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కొని అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి చిట్కాల ద్వారా అందమైన మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. ఆ వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాదం పొడిలో కొంచెం పచ్చి పాలు, ఓట్‌మీల్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ముఖానికి ఈ పేస్ట్ ను అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం రంగు కాంతివంతంగా తయారవుతుంది. బాగా పండిన బొప్పాయి పండు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవాలి ఒక 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల కాలుష్యం వల్ల ఏర్పడిన ట్యాన్ తొలగిపోయి మొహం కాంతివంతంగా తయారవుతుంది.
ఒక కప్పు లో కొంచెం నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం రోజ్ వాటర్,చక్కెర కలిపి ముఖం మీద అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది స్ర్కబ్ లాగ పని చేసి ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి మొహం మెరిసేలా చేస్తుంది.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.