...

Best mangoes: రసాయనాలు వాడని మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసా?

Best mangoes: ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎగబడుతుంటారు జనాలు. కానీ త్వరగా మామిడి కాయలు పండ్లు అయ్యేందుకు రసాయనాలు వాడుతుంటారు వ్యాపారులు. ప్రభుత్వం దీన్నినిషేందించినప్పటికీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లనే అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు. అయితే వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను మనం సులభంగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే సహజంగా పండించిన పండ్లు అయితే నీటిలో మునుగుతాయి. సహజంగా పండిన మామిడి పండ్లపై నొక్కిే మెత్తగా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చ స్పాట్స్ కనిపిస్తాయి. సహజంగా పండిన పండ్లు ఒకే రంగులో ఉంటాయి. ముదురు ఎరుపు, పసుపు రంగులో అవి ఉంటాయి. మామిడి పండ్లు లోపల అక్కడక్కడా పులుపు తాగిలితే కచ్చితంగా వాటిని కార్బైడ్ ఉపయోగించి పండించారని అర్థం. సహజంగా పండిన పండ్లలో రసం ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు రుచి కూడూ తియ్యగా ఉంటాయి.