Pani Puri : పానీపూరీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మన దేశంలో ఎక్కువగా పానీపూరీ స్టాల్స్ ఉంటాయి. అయితే కొందరు పానీపూరీ అనారోగ్యకరమైనదని చెబుతున్నా… ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అంటున్నారు. పానీపూరీ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పానీపూరిలో ఉపయోగించే నీరు చాలా వేడిగా, కారంగా, రుచిగా ఉంటుంది. ఇది ఆకలి కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అయితే అలసట నుంచి బయటపడేందుకు, బరువు తగ్గడానికి ఇంట్లో తయారు చేసిన పానీపూరీ తీసుకుంటే మంచిదని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు.
అలానే పానీపూరితో జీలకర్ర, పుదీనా నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇంట్లో తయారు చేసిన పానీపూరీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుందట. పుదీనా, జీలకర్రను నీటిలో కలుపుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మార్కెట్లో లభించే రెడీ టు మిక్స్ పానీ పూరీ మసాలాలో రాక్ సాల్ట్, ఎండు మామిడి, జీలకర్ర, కారం, బ్లాక్ సాల్ట్, పుదీనా, నల్ల మిరియాలు, ఎండు అల్లం, చింతపండు రసం, సిట్రిక్ యాసిడ్‌లు ఉంటాయి. అయితే పానీపూరీ నీటికి రుచిని జోడించేందుకు ఉప్పును పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. పుదీనా నీరు బరువు తగ్గేందుకు అద్భుతంగా పని చేస్తుందంటున్నారు.
Pani Puri : పానీపూరీ లో ఆరోగ్య ప్రయోజనాలు…
ఒక చిన్న గ్లాసులో నానబెట్టిన జీలకర్ర నీరు కడుపు సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి పానీ పూరీ పానీని తీసుకుంటే ఎంతో ఉపయోగమని ఓ పోషకాహార నిపుణులు తెలిపాడు. ఇక పానీపూరీలో రవ్వ, మైదాతో తయారు చేసినది శరీరానికి మంచిది కాదంటున్నారు. అయితే పానీపూరీని తయారు చేసేవారు శుభ్రత పాటించకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
Read Also : Egg Health Tips : గుడ్డును అలా తినడం కన్నా ఇలా చేస్తే బెటర్ అని తెలుసా…!