Gongura Mutton Recipe : గోంగూర మటన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని టేస్ట్ చూసిన వారందరికీ ఇది మంచి యమ్మి కర్రీ. గోంగూరలో ఉండే పోషకాలు.. మటన్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన వారు ఈ డిష్ నీ తప్పక ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం గోంగూర మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి.
కావలసిన పదార్ధాలు : | గోంగూర మటన్ కూర (Gongura Mutton) |
మటన్ | గోంగూర |
ఉల్లిపాయలు | పసుపు, ఉప్పు, కారం |
అల్లం | వెల్లుల్లి పేస్ట్ |
లవంగాలు | ధనియాలు |
ఇలాచి | గసగసాలు, కొబ్బరి, కొత్తిమీర |
గోంగూర మటన్ తయారీ విధానం (Gongura Mutton) :
ముందుగా అర కిలో మటన్ ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి, నీళ్లు మరిగాక మటన్ ముక్కలను వేయాలి. ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మటన్ ముక్కలను ఉడికించాలి. స్టవ్ మీద మరో కడాయి పెట్టుకోవాలి. అందులో నూనె వేసుకోవాలి. నూనె కాస్త కాగిన తరువాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని బాగా మగ్గనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. పసుపు వేసి కలుపుకోవాలి.
Gongura Mutton Recipe : గోంగూర మటన్ ఒకసారి టెస్ట్ చూస్తే.. ఖాళీ చేయకుండా వదిలిపెట్టరు..!
ఇప్పుడు ముందుగా వేడి నీటిలో మరిగించి పెట్టుకొన్న మటన్ ముక్కలను కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. మటన్ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరిని తీసుకొని తురిమి పొడి చేసుకోవాలి. సుమారు రెండు టేబుల్ స్పూన్ల పొడిని ఇందులో వేసుకోవాలి .15 నిమిషాల పాటు మటన్‌లో ఉడికించాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. నాలుగు లవంగాలు, నలుగు ఇలాచీలు, టీ స్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని పాన్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికించి ముక్కలను బాగా మగ్గనివ్వాలి.
ఇప్పుడు కొబ్బరిని తీసుకొని తురిమి పొడి చేసుకోవాలి. సుమారు రెండు టేబుల్ స్పూన్ల పొడిని ఇందులో వేసుకోవాలి.15 నిమిషాల పాటు మటన్‌లో ఉడికించాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. నాలుగు లవంగాలు, నలుగు ఇలాచీలు, టీ స్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని పాన్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఉడికిన మటన్ ముక్కలలో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. వీటిని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చివరగా తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడినీ ఇందులో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే టెస్టింగ్ గోంగూర మటన్ కర్రీ రెడీ.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world