Beauty Tips: అందంగా కనిపించాలని ఎవరైతే కోరుకోరూ చెప్పండి.అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభించే ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కొందరికి ముఖంపై మచ్చలు మంగు ఏర్పడటం వల్ల ఎంతో అందవిహీనంగా కనపడుతూ ఉంటారు. అయితే ఇలా మంగు ఏర్పడటంవల్ల దానిని తొలగించడం కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. ఈ విధంగా మొహం పై ఏర్పడిన మంగు తొలగిపోవాలంటే సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు కొద్ది రోజులలో అందమైన మొహం సొంతం చేసుకోవచ్చు.
Beauty Tips
మన ఇంటి ఆవరణంలో లభించే, ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి 10తులసి ఆకులు, 10వేపాకులు, 5 మందారం ఆకులను తీసుకొని మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ చందనం కలుపుకోవాలి. ప్రతిరోజు మొహం శుభ్రంగా కడిగి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా పది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించడంవల్ల మొహంపై ఏ విధమైనటువంటి మంగు, మచ్చలు లేకుండా ఎంతో అందమైన కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అయితే ఈ చిట్కా అందరి శరీరానికి పడకపోవచ్చు కనుక ముందుగా టెస్ట్ చేసుకున్న తరువాత అప్లై చేయడం ఎంతో మంచిది. ఎవరికైనా దురదలు మంటగా ఉంటే ఈ చిట్కా ఉపయోగించకపోవడం ఎంతో ఉత్తమం.
Read Also :Beauty Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటించాల్సిందే!