chewing betel effects : ప్రస్తుతం దాదాపుగా అందరూ భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా వక్కపొడిన తీసుకుంటుంటారు. అలా వక్క పొడి తీసుకుంటే తిన్న ఆహార పదార్థాలు జీర్ణమవుతాయని భావిస్తారు. ఎందుకంటే.. గతంలో మాదిరిగా శరీరానికి శ్రమ చేకూర్చే పనులు ఎలాగూ చేయడం లేదు. కాబట్టి.. వక్కపొడి ద్వారా తిన్న ఫుడ్ ఐటమ్స్ డైజెస్ట్ అవుతాయని అనుకుంటారు. కాగా, వక్క పొడిని యాజ్ ఇట్ ఈజ్‌గా మాత్రమే కాకుండా వివిధ రకాలుగానూ తింటుంటారు. అయితే, అందరూ ఒకేలాగా వక్క పొడిని తినరు.
కొందరు పాన్‌లో కలుపుకుని తింటుండగా, మరి కొందరు యాలకులు, సున్నం, తమలపాకు, దాల్చిన చెక్క, ఇతరాలు కలుపుకుని తీసుకుంటారు. అయితే, అతి ఎప్పుడైనా చేటు చేసే మాదిరిగా వక్క పొడిని కూడా అతిగా తిన్నట్లయితే అరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వక్కపొడిని అతిగా నమిలి తిన్నట్లయితే కనుక నోటి కేన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి లిమిట్‌గానే తీసుకోవడం మంచిది. దాంతో పాటు ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఇష్యూ కూడా రావచ్చు. దీని వలన దవడల కదలిక ఆగిపోయే ప్రమాదముంటుంది. వక్క పొడి తినే క్రమంలో దవడలు కంపల్సరీగా పని చేయాల్సి ఉంటుంది.
మరీ ముఖ్యంగా వక్కపొడిని ఎక్కువగా తింటే కనుక హార్ట్ డిసీజెస్ వచ్చే చాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వక్క పొడిని పరిమితిలో తీసుకోవాలి. ఊబకాయ సమస్యలు వక్కపొడి ఎక్కువగా తినేవారిలో వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.
ఈ క్రమంలోనే వక్క పొడిని ఎక్కువగా నమలడం వలన దంత సంబంధిత సమస్యలు కూడా తలెత్తొచ్చు. వక్కపొడిని ఎప్పుడూ నమలడం వలన దంతాలు రెండ్ కలర్‌లోకి చేంజ్ అయి పర్మినెంట్‌గా ఆ కలర్‌లోనే ఉండిపోతుంటాయి. కాబట్టి వక్కపొడి అలవాటున్న వారు మానేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.