...

Saffron Tea: మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?ఈ టీ దివ్యౌషధంలా పనిచేస్తుంది..!

Saffron Tea: కుంకుమ పువ్వులు మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. కుంకుమపువ్వు ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ దీని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. కుంకుమ పువ్వు లు ఐరన్, కాపర్, జింక్, మెగ్నిషియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ విటమిన్ సి వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. సాధారణంగా అందరూ కుంకుమ పువ్వు ని పాలలో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఎలా ఇలా తాగడం వల్ల కుంకుమ పువ్వు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

కుంకుమ పువ్వు టీ తయారు చేసుకొని తాగటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి గుండె సంబంధిత వ్యాధులు , శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కుంకుమపువ్వు టీ తయారు చేయటానికి ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి రెండు లేదా మూడు కుంకుమ పువ్వు రేకులను అందులో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిలో కొంచెం అల్లం 4 పుదీనా ఆకులు వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఆ నీటిని గోరువెచ్చగా చేసి తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కుంకుమపువ్వు టీ తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అధిక బరువు సమస్యను దూరం చేయవచ్చు. మహిళలు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను నివారించడానికి కుంకుమపువ్వు టీ ఎంతో దోహదపడుతుంది. ఈ టీ తాగడం వల్ల శరీరంలో రక్తనాళాలు శుభ్రంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ముఖ్యంగా మతిమరుపు సమస్యతో బాధపడేవారు కుంకుమపువ్వు టీ తాగడం వల్ల అందులో ఉండే క్రోసిన్ సమస్యలను దూరం , మెదడు చురుకుగా పనిచేసేలా ఎంతో ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా ఈ టీ తాగడం వల్ల వారి సమస్యలు దూరం చేయవచ్చు.