Mango Health Benefits: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఈ క్రమంలోనే మామిడిపండ్ల ప్రియులు ఎక్కువగా మామిడి పండ్లను కొనుగోలు చేసి ఎంతో సంతృప్తిగా తింటూ ఉంటారు. ఇలా మామిడి పండ్లు కేవలం ఏడాదికొకసారి మాత్రమే వస్తాయి కనుక చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…
*మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు సమస్యను అదుపులో ఉంచడానికి కీలకపాత్ర పోషిస్తాయి.
*రక్తహీనత సమస్యతో బాధపడే వారు మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది.మామిడి పండులో ఐరన్ క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడటమే కాకుండా ఎముకల దృఢత్వానికి కూడా దోహదం చేస్తుంది.
*మామిడి పండులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. అలాగే ఫైబర్ కంటేట్ అధికంగా ఉండటం చేత కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో శరీర బరువు తగ్గించుకోవడానికి కూడా మామిడిపండ్లు దోహదం చేస్తాయి.
*కేవలం మామిడికాయ మాత్రమే కాకుండా మామిడి ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ సమస్యతో బాధపడేవారు 5 లేదా 6 మామిడి ఆకులనురాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.
*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్(కాన్సర్ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్ ఇవన్నీ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తూ మన శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కణాలను నశింపజేసే క్యాన్సర్ నుంచి మనకు విముక్తిని కలిగిస్తాయి.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.