Kids distribute water: పొట్టకూటి కోసం మండుటెండను సైతం లెక్కచేయకుండా వీధుల్లో వ్యాపారం చేసుకుంటున్న కొందరిని చూసిన ఓ బాలుడి… మనసు కరిగిపోయింది. చల్లని మంచి నీళ్ల సీసాలు కొని వారికి అందించి తన ఉదారతను చాటుకున్నాడు. పూలు, పండ్లు అమ్ముకుంటూ బ్రతుకీడుస్తున్న వారిని దేవుడిలా ఆదుకున్నాడు. అయితే అంత ఎండలో చల్లని నీళ్లను అందించడతో ఓ వృద్ధురాలు మనసారా దీవించిందా బాబును. అయితే ఆ బాలుడు నీళ్లు పంచుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా… చూసిన వారంతా బాబును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తన కోసం చల్లటి వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన ఆ బాలుడిని ఒక వృద్ధురాలు మనసారా ఆశీర్వదించింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా… బాలుడి ఔదార్యాన్ని చూసి నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత పదేళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో ఎండలో మండుతున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పిందంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.