...

Bad News for Drinkers : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ ప్రభావం ఎంత సేపు ఉంటుందంటే?

Bad News for Drinkers : ప్రజెంట్ టైమ్స్‌లో మద్యం అలవాటు ట్రెండ్ అయిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యూత్ ముఖ్యంగా ఆల్కహాలిక్ అవుతున్నారు. ఆల్కహాల్‌ను ఒక హాబీలాగా మార్చుకుంటున్నారు. స్టైల్ కోసం మొదలు పెట్టి అలానే కొనసాగిస్తున్నారు. అయితే, ఆల్కహాల్ శరీరంలో ఉండిపోతే కలిగే నష్టాల గురించి వారికి అస్సలు తెలియదు. అవేంటో తెలుసుకుందాం.

ఒకసారి మద్యం తీసుకున్న తర్వాత అది శరీరంలోనికి వెళ్లి రక్త ప్రవాహంలోకి ఎంటర్ అవుతుంది. అలా మెల్లగా బాడీ అంతా ఎంటర్ అయి అలానే ఉండిపోతుంది. దాని బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ లెవల్స్ అలానే ఉండిపోతాయి. తద్వారా ప్రభావం తగ్గదు. అయితే, ఒక మనిషి నుంచి మరొక మనిషికి మధ్య ఆల్కహాల్ జీవక్రియ రేటు మారుతుంటుంది.

ఒకరి లోపల ఆల్కహాల్ స్థాయి ఒకలా ఉంటే మరొకరి లోపల మరోలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ తీసుకునే వారు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది జీర్ణమయ్యే జీవక్రియ రేటు ఎక్కువవుతుంటుంది. మద్యం తీసుకున్న తర్వాత అది మెటాబోలైజ్ అయ్యే సమయం చిన్న షాట్ అయితే ఒక గంట ఉండగా, పింట్ బీర్‌కు రెండు గంటలు, పెద్ద గ్లాసు వైన్‌కు మూడు గంటలు పడుతుంది.

రక్తంలోని ఆల్కహాల్ గాఢత శాతాన్ని బట్టి జీవక్రియ రేటు మారుతుంటుంది. ఆల్కహాల్ తీసుకున్నపుడు అది డైరెక్ట్‌గా డైజేషన్ సిస్టమ్‌లోకి ఎంటరవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆల్కహాల్ బ్లడ్‌లోకి వెళ్లి అక్కడి నుంచి బ్రెయిన్ వరకు వెళ్తుంది. పేగుల్లోనూ ఉండి.. కాలేయంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాటున్న వారు ఈ వివరాలు తెలుసుకుని అయినా సరే దానని మానేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తీసుకున్న 80 గంటల తర్వాత మూత్ర పరీక్ష చేసి ఎంత మద్యం తాగారానే విషయాన్ని కనుక్కోవచ్చు.
Read Also : Eluka Jemudu Plant : ఎలుక జెముడు మొక్క గురించి విన్నారా..!? ఈ మొక్కతో ప్రపంచాన్ని వణికించే ఈ వ్యాధికి చెక్..!!