Categories: Entertainment

Graham: శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర కాంబినేషన్ లో సినిమా.. ఎప్పుడో తెలుసా..?

Graham: జయ శంకర్ దర్శకత్వంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ఆర్వి సినిమాస్ బ్యానర్ పై ఆర్వి రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఇందులో సాయి కుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత శేషు మారం రెడ్డి మాట్లాడుతూ..దర్శకుడు జయశంకర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని. మిగిలిన 20 శాతాన్ని ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఇందులో చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు జయ శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడని, ఆ సన్నివేశాలు థియేటర్ లో తప్పకుండా నవ్వులు పూయిస్తాయి అని తెలిపారు. ఈ సినిమా తర్వాత ఆయనతో మరో సినిమా చేయడానికి ప్లాన్ కూడా చేస్తున్నాను అని తెలిపారు నిర్మాత శేషు మారం రెడ్డి.

అనంతరం దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకు ఉత్సాహంతోనే అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని, తమ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్లస్ అవుతుందని తెలిపారు దర్శకుడు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ను, అలాగే విడుదల తేదిని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి ఈ సినిమాకు గ్రహమ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దర్శకనిర్మాతలు చెప్పిన విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి మరి.

Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి!

Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…

4 weeks ago

Ketu Transit 2025 : కేతు సంచారంతో ఈ 5 రాశుల వారు కుబేరులు అవుతారు.. పట్టిందల్లా బంగారమే.. డబ్బుకు ఇక కొదవే ఉండదు..!

Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…

4 weeks ago

Kotak Mahindra Bank : ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేత.. కొత్త క్రెడిట్ కార్డుల సేవలు..!

Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…

4 weeks ago

Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…

4 weeks ago

Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!

Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…

4 weeks ago

RBI 50 Note : రూ. 50 నోటుపై బిగ్ అప్‌డేట్.. ఆర్బీఐ కొత్త నోటు తీసుకొస్తోంది.. పాత నోట్లు చెల్లుతాయా?

RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…

4 weeks ago

This website uses cookies.