Keerthi Suresh : మురారి బావ పాటలు గ్లామర్ వలక బోసిన కీర్తి సురేష్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్?

Keerthi Suresh
Keerthi Suresh

Keerthi Suresh : గ్లామర్ షో కి దూరంగా ఉంటూ ఎంతోసాంప్రదాయమైన దుస్తులను ధరిస్తూ మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వారిలో కీర్తిసురేష్ ఒకరు. ఈమె వీలైనంత వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇకపోతే గత కొంత కాలం నుంచి కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి.అయితే మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట ఈమె ఫ్లాప్ సినిమాలకు బ్రేక్ వేసింది.

Keerthi Suresh
Keerthi Suresh

ఇక ఈ సినిమాలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కొత్తగా యాడ్ చేసిన మురారి బావ అనే పాటలో ఈమె మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేశారు. ఇక కీర్తి సురేష్ ను ఈ విధంగా చూసిన అభిమానులు నీలో యాంగిల్ కూడా ఉందా అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొంటున్న కీర్తి సురేష్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కాస్త గ్లామర్ షో కి తెరతీసింది.

Advertisement

ఈ సినిమాలో కళావతి పాత్ర ద్వారా ఈమె పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డే టాక్ వచ్చినప్పటికీ అనంతరం అద్భుతమైన కలెక్షన్లను మంచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలు పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Keerthi suresh : మహేష్ బాబు గురించి కీర్తి సురేష్ ఎమోషనల్ పోస్ట్.. అందులో ఏముందంటే?

Advertisement