Jetty Movie Review : ప్రతి ప్రేక్షకుడి గుండె తాకే కథ!

మత్స్య కారులకు సంబంధించిన కథల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలని వెండి తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. గతంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత హిట్ అయిందో ఇండస్ట్రీ కి తెలుసు. తాజాగా తీరా ప్రాంతానికి చెందిన కథతో జెట్టి అనే సినిమాని తెరకెక్కించారు నిర్మాతలు. వర్ధిన్ ప్రోడక్షన్స్ అనే పతాకంపై వేణు మాధవ్ కె నిర్మించారు. ఈ చిత్రానికి సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ గళ్ళ జయదేవ్ దగ్గరి బంధువు అయిన మాన్యం కృష్ణ హీరోగా నటించారు. అతని సరసన నందితా శ్వేత హీరోయిన్ గా నటించారు. శివాజీ రాజా, కన్నడ కిషోర్, మైమ్ గోపి విలన్ గా నటించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మరి ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం పదండి.
jetty-movie-review-and-rating-full-details-inside
చిత్రం : జెట్టి
నటీనటులు : తేజశ్వని బెహెర, M.S. చౌదరి, జీ కిషోర్, గోపి, జీవ, మాన్యం కృష్ణ, శివాజీ రాజా, సుమన్ శెట్టి, నందిత శ్వేతా.
నిర్మాత : కే వేణు మాధవ్
బ్యానర్ : వర్థని ప్రొడక్షన్స్
దర్శకత్వం : సుబ్రహ్మణ్యం పిచ్చుక
సంగీతం : కార్తీక్ కొడకండ్ల
విడుదల తేదీ : నవంబర్ 04, 2022
కథ: సముద్ర తీరా ప్రాంతంలో వుండే కటారి పాలెం గ్రామానికి చాలా కట్టుబాట్లు ఉంటాయి. వాటిని ఆ ఊరి గ్రామ పెద్ద అయిన జాలయ్య(ఎం.ఎస్. చౌదరి) ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ… ఆ ఊరికి, అక్కడ వున్నా చుట్టూ పక్కల ప్రాంతానికి పెద్ద కాపుగా వుంటారు. తరచూ గ్రామానికి చెందిన మత్స్య కారుల బోట్స్ తుపానుల తాకిడికి కొట్టుకు పోయి నష్టాలను తెస్తుంటాయి. దాంతో ఎలాగైనా జెట్టి నిర్మించి మత్స్య కారులను ఆదుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే అయిన దశరథ రామయ్య(శివాజీ రాజా)కి మొరపెట్టుకుంటారు. అయితే అతను ప్రతి పక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కావడంతో తానూ జెట్టిని కట్టలేనని చేతులెత్తేస్తాడు.
అయితే ఈ జెట్టి నిర్మిస్తే మత్స్యకారులు తమను లెక్క చేయరని విలన్ (మైమ్ గోపి ) అడ్డు తగులుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ గ్రామానికి ఉపాధ్యాయినిగా వచ్చిన శ్రీ (కృష్ణ మాన్యం) గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ… జాలయ్య కూతురు మీనాక్షి( నందిత శ్వేత) ప్రేమలో పడతారు. వీరిరువురు ఓ రోజు గ్రామ వదిలి వెళ్ళిపోతారు. దాంతో ఆ ఊరి సంస్కృతి సంప్రదాయం, కట్టు బాట్ల ప్రకారం జాలయ్య అవమానంగా ఫీల్ అవుతాడు. మరి జాలయ్య ఓ వైపు తనని నమ్ముకున్న మత్స్య కారులకి జెట్టిని ప్రభుత్వం నుంచి సాధించుకున్నారా? అలాగే ఊరి కట్టుబాట్లని లెక్క చేయకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిన తనకూతురుని ఎం చేసాడు అనేదే జెట్టి మిగతా కథ.

Jetty Movie Review : కథ… కథనం విశ్లేషణ :

జెట్టి అంటే.. ఫిషింగ్ హార్బర్.. కోస్తాంధ్ర మత్స్య కారులకు జెట్టిలు ప్రధాన ఆదాయ వనరులు. సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాన్ని కలిపే వంతెనను జెట్టి అంటారు. ఈ జెట్టి అవసరం ఏమిటనే కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో దర్శకుడు తీరా ప్రాంతంలో ఉన్న కటారి పాలెం అనే ఓ గ్రామాన్ని తీసుకొని… ఆ ప్రాంతం, దాని చుట్టూ పక్కల వుండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంగా కథ నాన్ని రాసుకుని వెండితెరపై మత్స్య కారుల జీవితాన్ని ఆవిష్కరించారు. అలానే మత్స్య కారులని దోచుకునే ఓ మోతుబరి ఆ ప్రాంతాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంటాడు. అతడిపై మత్య్సకారులు ఎందుకు ఎదురు తిరిగారు అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న కథ, కథనాలు ప్రేక్షకులని కట్టి పడేస్తాయి. ఇందులో ఎంతో భావోద్వేగం ఉంటుంది. కూతుళ్ల మధ్య వుండే ఓ ఎమోషనల్ బాండింగ్‌ క్లయిమాక్స్ లో కంటతడి పెట్టిస్తుంది. ఆ ప్రాంతానికి జెట్టి తీసుకు రావడానికి ఓ తండ్రి ఏం చేశారు అనేది ఈ సినిమాకు ఆత్మ లాంటిది. జెట్టి సినిమా గుండెను బరువెక్కించే సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.
గ్రామ పెద్ద జాలయ్య పాత్రలో ఎమ్మెస్ చౌదరి బాగా క్యారీ చేశారు. తన్ని నమ్ముకున్న వారికి ఓ గ్రామ పెద్దగా ఎలా సహాయం చేయాలనే పాత్రని బాగా పండించారు. హీరోగా నటించిన కృష్ణ మాన్యం… స్కూల్ టీచర్ పాత్రలో ను … గ్రామాభివృద్ధికి పాటు పడే మంచి యువ ఉపాధ్యాయ పాత్రలో చక్కగా వొదిగి పోయారు. హీరో కటౌట్ కూడా ఆరడుగులు పైనే ఉండటంతో యాక్షన్ సీన్స్ లోను మెప్పిచారు. అతనికి జోడిగా నటించిన నందిత శ్వేత పైగా గ్రామీణ యువతిగా, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారిణిగా చక్కగా నటించారు. విలన్ గా మైమ్ గోపి రౌద్రం పండించారు.
పొలిటీషియన్ పాత్రలో శివాజీ రాజా పర్వాలేదు అనిపించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. దర్శకుడు రాసుకున్న కథ… కథనాల్లో జీవం వుంది. ఇందులో హృదయాన్ని తాకే మట్టి పరిమళాలు వున్నాయి. దాన్ని ఇంకాస్త హృద్యంగా తెరమీద చూపించి ఉంటే బాగుండేది. సంగీతం బాగుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!
Advertisement
Tufan9 News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

2 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.