September 21, 2024

Sudheer -Rashmi: జబర్దస్త్ సుధీర్ రష్మి లవ్ స్టోరీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ… రేటింగ్ కోసం కాదంటూ కామెంట్స్!

1 min read
pjimage 26 2

Sudheer -Rashmi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మీ సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని వీరి చేత పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇకపోతే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు అలాగే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

pjimage 26 2ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న స్టాండప్ రాహుల్ చిత్రంలో ఈమె హీరో తల్లి పాత్ర ద్వారా సందడి చేయడానికి సిద్ధమైంది.ఈ సినిమా ఈ నెల 18వ తేదీ విడుదల కావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కార్యక్రమాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..ఇన్ని రోజులు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలన్ని స్క్రిప్ట్ అనుకొని పొరపాటు పడ్డాను అయితే అవి నిజంగా స్క్రిప్ట్ కాదని రియల్ ఎమోషన్స్ అంటూ తెలియజేశారు.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా రష్మీ సుధీర్ లవ్ స్టోరీ గురించి ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ నిజమేనా అంటూ ఇంద్రజను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నపై స్పందిస్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీ అనేవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలని, వారి వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడ దలుచుకోలేదని ఈమె సమాధానం చెప్పారు.అయితే వారిద్దరి మధ్య లవ్ ఉందా అనే విషయం గురించి మాత్రం తెలియదని ఇంద్రజ తెలిపారు.