Bigg Boss 6 Telugu : ఆర్జే సూర్యకి పెదాలతో సైగ చేసిన ఆరోహి, ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్!

Big boss 6 telugu episode 24th full details here
Big boss 6 telugu episode 24th full details here

Bigg Boss 6 Telugu : నిన్నటి నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ హోరెత్తిపోయింది. ఇక మంగళవారం 24వ ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ రంజుగా సాగింది. నిన్నటి నామినేషన్స్ లో ఇనయని నామినేట్ చేసిన మోరీనా రోహిత్.. ఈరోజు ఆమె దగ్గరకు వెళ్లి హగ్ చేస్కుంది. ఆ తర్వాత రోహిత్ కూడా వచ్చి ఇనయకి సారీ చెప్తూ కనిపించాడు. సొల్లు కారణాలతో నామినేట్ చేసి.. ఇప్పుడొచ్చి ఈ కాకా పెట్టడం ఏంటో అనిపించేలా చేశారు ఈ భార్యాభర్తలు. అయితే ఇనయ పక్కనే ఉన్న ఫైమా చురకలేసింది. మన టీంలో ఉండి ఎవరూ తీసుకోలేదని స్టాండ్ తాను తీస్కొని ధైర్యంగా వెళ్లింది. మనం చెప్పాం కనుక ఆమె చేసింది… దానికి నామినేట్ చేయడం ఏంటని రోహిత్, మెరీనాలకు చురకలేసింది ఫైమా.

Big boss 6 telugu episode 24th full details here
Big boss 6 telugu episode 24th full details here

ఆ తర్వాత అనయ వాసంతి దగ్గర కూర్చొని గ్రూప్ లో ఉండి ఎరి గేమ్ వాళ్లు ఆడుకున్నరు.. నేను మాత్రం గ్రూప్ గెలవాలని ఆడాను. అందుకే చెడ్డదాన్ని అయిపోయాను అంటూ ఇనయ బాధపడింది. ఇక శ్రీహాన్ తనలో తానే మాట్లాడుకుంటూ కనిపించాడు. ఈ జబ్బు ఏంటో కానీ ఎవడైనా మనసులో మాట్లాడుకుంటాడు. కానీ మనోడు మాత్రం మైక్ లో కెమెరాలు ఫోకస్ అయ్యేట్లుగా పైకి మాట్లాడుతాడో కావాలనే.. ఈ నామినేషన్స్ ఏంటో ఒకడేమో ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. ఈమె ఏమో అన్నది ఒకటి అయితే నానార్థాలు పర్యాయ పదాలుగా తీస్తుందని మాట్లాడుకున్నాడు.

Advertisement

Read Also : Big boss 6 telugu: సత్యను తప్ప అందరినీ సిస్టర్ అని పిలుస్తాడట, ఎందుకో మరి!

Advertisement