...

Actress Meena Husband : మీనా భర్త మృతికి పావురాలే కారణమా? అసలేం జరిగిందంటే?

Actress Meena Husband : ప్రముఖ సినీనటి మీనా ఇంటి విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మాకంగా మృతిచెందారు. విద్యాసాగర్‌ మృతికి సంబంధించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మీనా భర్త కరోనా ఇన్ఫెక్షన్ల కారణంగానే మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే విద్యాసాగర్ మృతికి పావురాలే కారణమనే వార్త హల్ చల్ చేస్తోంది. తమిళనాట మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. విద్యాసాగర్ ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటనే ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని భావించారు.

Actress Meena Husband Death Reason behind Pigeons
Actress Meena Husband Death Reason behind Pigeons

బ్రెయిన్‌డెడ్ వ్యక్తి అవయం అవసరమైంది. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న హఠాన్మారణం పొందారు. మీనా ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. పావురాల వ్యర్థాల గాలిని ఎక్కువగా పీల్చడంతో మీనా ఇంట్లో కుటుంబ సభ్యులందరికి లంగ్ ఇన్ఫెక్షన్ సోకిందని చెబుతున్నారు.

మీనా భర్త విద్యాసాగర్ కు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. దాంతో విద్యాసాగర్‌కు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇంతలోనే విద్యాసాగర్ మృతిచెందారు. విద్యాసాగర్ మృతికి పావురాల వ్యర్థాలే కారణమా? అనేది స్పష్టత లేదు. విద్యాసాగర్ మృతికి అసలు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

విద్యా సాగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యా సాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని… మీనా ఆమె కుటుంబ సభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోందని సీనియర్ నటుడు శరత్ కుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యా సాగర్ మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు.

Read Also : Actress Meena : నటి మీనా ఇంట విషాదం.. భర్త విద్యా సాగర్ హఠాన్మరణం!