Anchor suma : యాంకర్ సుమ.. చాలా వరకు ఎలాంటి పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లయినా, ప్రోగ్రామ్ లు అయినా ఈమెతో చేయించుకోవాలని తెగ ఆసక్తి చూపిస్తుంటారు చాలా మంది. ఈమె ప్రోగ్రాం హోస్ట్ చేస్తుందంటే… డైరెక్టర్లు, ఈవెంట్ మేనేజర్లు రిలాక్స్ అయిపోవచ్చు. అన్నీ ఆమే చూసుకుంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు కాబట్టి ఎలాంటి భయం లేకుండా షోలను పూర్తి చేస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నా… ఆమె రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లోనే ఉంటుంది. గత ఏడాది కింద ఏమో కానీ ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ నాలుగు లక్షలకు పైమాటే. తక్కువలో తక్కువ రెండు లక్షలు ఇస్తే కానీ ఈవెంట్ చేయదట. అంతే కాదండోయ్.. ఎలాంటి సినిమా అయినా సరే ముందుగానే ఈమె డేట్ లు ఫిక్స్ చేసుకోవాలట. లేకపోతే ఈమె దొరకడం కష్టమే.

Anchor suma remunaration and conditions for event
రెమ్యునరేషన్, కాల్ షీట్స్ తో ముచ్చట అయిపోలేదు… ఈవెంట్ ఎన్ని గంటల చేస్కున్నా పర్లేదు కానీ ఆమె మాత్కం రెండే రెండు గంటలు ఉంటుంది. అంటే గంటకు రెండు లక్షలు అన్నమాట. మరి సుమతో యాంకరింగ్ అంటే ఆమాత్రం డబ్బులు ఫెట్టాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ కాకముందే ఆమె అక్కడి నుంచి జారుకుంది.
Read Also : Anchor suma: డైరెక్టర్ మారుతి మామూలోడు కాదుగా.. సుమపైనే కామెంట్లు!