Jabardasth judge: బుల్లితెరపై విపరీతమైన టీఆర్పీతో దూసుకుపోతున్న కామెడీ షఓ జబర్దస్త్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతో మంది కమెడియన్లకు జీవితాన్ని ఇచ్చింది జబర్దస్త్ షో. గతంలో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించే వాళ్లు. కానీ కొన్ని కారణాల వల్ల నాగబాబు షో నుచి తప్పుకున్నారు.
ఆ తర్వాత మంత్రి పదవి రావడంతో రోజా కూడా జబర్దస్త్ ను వీడారు నాగబాబు స్థానంలో ఎంత మందిని ట్రై చేసినా సెట్ అవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలం సింగర్ మను జడ్జిగా వ్యవహరించగా.. మళ్లీ కొత్త వాళ్లను ట్రై చేస్తున్నారు. ఇటీవలే కొన్ని ఎపిసోడ్ లకు కుష్బూ కూడా వచ్చింది. రోజా స్థానంలో మాత్రం ప్రస్తుతం ఇంద్రజ కొనసాగుతోంది.
అయితే తాజాగా వచ్చిన ఎపిసోడ్ ప్రోమోలో సీనియర్ యాక్టర్ కృష్ణ భగవాన్ ను కొత్త జడ్జిగా తీసుకవచ్చారు. ఆయన రాకతోనే తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. ముందుగా శివుపుత్రుడుస సినిమా స్కూప్ ను వెంకీ మంకీస్ చేశారు. వీళ్ల స్కిట్ పై ఇంద్రజ స్పందించగానేయయ ఈవిడ స్కిట్ కన్నా జడ్జిమెంట్ ఎక్కుసేపు చెబుతారంటూ కామెంట్లు చేశారు. మరి ఈయన ఎన్నో రోజులు జడ్జిగా కొనసాగుతారో తెరపై చూడాల్సిందే.