Weekly Horoscope 2022 : నవంబర్ వారఫలాలు (07-13) : ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. నక్కతొక తోకినట్టే.. ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?

Weekly horoscope November 7 to 13 November 2022 know prediction of all zodiac signs in Telugu
Weekly horoscope November 7 to 13 November 2022 know prediction of all zodiac signs in Telugu

Weekly Horoscope 2022 : వారం రాశిఫలాలు 7 నుంచి 13 నవంబర్ 2022 : దేవ్ దీపావళి (Dev Diwali 2022)తో కొత్త వారం ప్రారంభమైంది. గ్రహాలు, రాశుల స్థితి ప్రకారం.. ఈ వారం అనేక రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. నవంబర్ రెండవ వారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తేదీతో ప్రారంభమవుతుంది. ఈ వారం రాశిచక్రంలో శుక్రుడు, కుజుడు, బుధుడు సంచరిస్తున్నారు. ఈ పరిస్థితిల్లో గ్రహాల సంచారం అనేక రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని రాశుల వారు ఈ వారం అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ నవంబర్ రెండవ వారం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.

Advertisement
Weekly horoscope November 7 to 13 November 2022 know prediction of all zodiac signs in Telugu
Weekly horoscope November 7 to 13 November 2022 know prediction of all zodiac signs in Telugu

మేషరాశి :
ఈ రాశివారిపై పనిభారం అధికంగా ఉండవచ్చు. ఆఫీసులో ఎక్కువ పని గంటలు కారణంగా అనేక ఇబ్బందులు పడవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో ఒంటరితనానికి గురవుతారు. అలాంటి పరిస్థితిలో.. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడంపై దృష్టిపెట్టండి. అదే మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్య పరంగా విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పవచ్చు.

Advertisement

వృషభం :
మీరు మీ గతంలో వదిలేసిన మీ అభిరుచులను తిరిగి పొందేందుకు ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ వారంలో మీ సృజనాత్మక నైపుణ్యాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు. మీ ఆదాయం, ఖర్చులపై బ్యాలెన్స్ చేయవచ్చు.

మిధునరాశి :
ఈ వారంలో ఆధ్యాత్మిక విద్యపై మీ ఆసక్తి పెరుగుతుంది. అద్దెకు ఉంటున్న వారు నివాసం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ వారం తొలి రోజుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సానుకూల ఆలోచనలతో ఉండండి. ప్రజా రవాణాలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

Advertisement

కర్కాటక రాశి :
ఆఫీసుల్లో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్య పరంగా.. మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుంది. ఈ వారం మొత్తం మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో తెలివిగా వ్యవహరించండి. లేదంటే.. అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.

సింహరాశి :
ఈ వారంలో మీరు మీ ప్రవర్తనతో కొన్ని సమస్యలు ఎదురు కావొచ్చు. మంచి అనుభూతి కోసం మీ కుటుంబం, ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. మీ మానసిక స్థితిని బట్టి మీ భాగస్వామి పాత్ర పోషిస్తారు. మీ సంబంధాన్ని బలోపేతం చేసేందుకు నిజాయితీగా ఉండండి.

Advertisement

కన్య రాశి :
ఈ వారం ప్రేమికుల్లో మాజీ భాగస్వామితో మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. కొన్ని ఆర్థిక సలహాలు ఈ వారంలో భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. అయితే, మీ ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మీ పొదుపుపై దృష్టిపెట్టండి. ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ ఆరోగ్యంపై మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.

Weekly Horoscope 2022 : ఈ రాశుల వారికి అన్ని ఇబ్బందులే..  

తులారాశి :
మీ అమాయకత్వంతో మీరు ఈ వారం చాలా మంది అభిమానుల హృదయాలను గెలుచుకోబోతున్నారు. మీ సలహాలు మీ స్నేహితుని జీవితంలోని సమస్యను పరిష్కరిస్తాయి. బహుశా మార్చలేని విషయాలపై దుఃఖిస్తూ మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీరు శక్తివంతంగా, ప్రత్యేకంగా అనుభూతి పొందడానికి ప్రియమైన వారితో కలిసి ప్రేమగా మాట్లాడండి.

Advertisement

వృశ్చిక రాశి :
చెడు వైఖరిని తగ్గించుకోండి. ఎందుకంటే మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. చెడు వైఖరి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఇతర వ్యక్తులకు దూరం చేస్తుంది. మీ సృజనాత్మక అభిరుచులపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రశాంతంగా ఉండండి.

ధనుస్సు రాశి :
మీ జీవిత లక్ష్యాలను సాధించేందుకు ఈ వారం సరైనదిగా చెప్పవచ్చు. వ్యూహాత్మకంగా ఉండేందుకు అవకాశాలను వినియోగించుకోండి. మీ నిరంతర, ప్రయత్నాలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఆఫీసుల్లో మీ సీనియర్ సభ్యుల నుంచి ప్రశంసలు పొందుతారు.

Advertisement

మకర రాశి :
కొన్ని నిలిచిపోయిన ప్రాజెక్ట్‌ల కారణంగా ఈ వారం ఆఫీసులో కొన్ని అదనపు గంటలు చేయాల్సి రావొచ్చు. అయినా భయపడవద్దు. ఎందుకంటే ప్రశాంతంగా, సంయమనంతో ఉండటమే పరిష్కారం. మీ వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని వెచ్చించండి. ఆరోగ్య పరంగా విషయాలు స్థిరంగా కనిపిస్తున్నాయి.

కుంభ రాశి :
పని సంబంధిత ఒత్తిడి ఈ వారం మీ మనస్సును పాడు చేస్తుంది. ఆఫీసులో మీ పని విషయంలో బాస్ కోపాడమే అవకాశం ఉంది.. కాస్తా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు.. మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో ఈ వారం అనుకూలంగా లేదని గమనించాలి. ఈ వారం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది.

Advertisement

మీనరాశి :
ఆర్థిక పరంగా.. మీరు మీ రుణాలను తిరిగి చెల్లిస్తారు. గతంలో మీరు చెల్లించిన డబ్బును తిరిగి చెల్లించగలరు. కొన్ని ఊహించని ఖర్చులు మీకు రావచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఈ వారాంతంలో కొన్ని ఆరోగ్య సంబంధిత రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ త్వరలోనే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఉదయాన్నే యోగా చేయడం, వ్యాయామం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.

Read Also : Chandra Grahan 2022 : చంద్రగ్రహణంలో గ్రహాల కలయిక వల్ల ఈ రాశుల వారికి అనుకోని కష్టాలు.. ఆ దేవుడే కాపాడాలి..!

Advertisement