...

Ganesha Slokams : ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందా? ఈ శ్లోకాలు పఠిస్తే చాలు..!

Ganesha Slokams  : ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యంగానే ఉంటుందా? పని ప్రారంభించిన ప్రతిసారి విఘ్నాలు ఎదురువుతున్నాయా? అయితే గణనాథుడి అనుగ్రహం ఉండాల్సిందే… ఎందుకంటే.. ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడు. ఏ పూజ చేసినా గణనాథుడికి ముందుగా పూజ చేయాల్సిందే…

ganesha slokas
ganesha slokas

అది దైవకార్యాలు కావొచ్చు.. ఏ పనితలపెట్టినా తప్పనిసరిగా ముందు గణనాథుడిని పూజించాలి. ఇది ప్రతిపూజా విధానంలో అందరూ అనుసరించేది.. అప్పుడు మాత్రమే ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆయన అడ్డుకుంటారని విశ్వాసం.. అయితే సాధారణ పనుల్లో కూడా చాలామందికి అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి.

ఎందుకు అలా జరుగుతుందో ఏమో తెలియదు. కానీ, వరసుగా ఆటంకాలు ఎదురుకావడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. చేసే పనిపై కూడా ఏకాగ్రత కోల్పోతారు. చివరికి ఆ పనిని మధ్యలోనే వదిలేస్తుంటారు. పని పూర్తి అవుతుందనే నమ్మకం కోల్పోతారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి మన పురాణాల్లో మంచి శ్లోకాలు అందించారు.

ఈ శ్లోకాలను నిత్యం పఠించడం ద్వారా అనేక సమస్యలను నివారించుకోవచ్చునని మహా పండితులు చెబుతున్నారు. అనుకున్న పని పూర్తి కాకపోవడం గానీ, రావాలిసిన డబ్బులు వసూలు కాకపోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, కొత్త ఉద్యోగవకాశాలు రాకపోవడం, లాభాలు చేతిదాకా వచ్చి చేయిదాటిపోవడం జరుగుతోందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం ఉంది.. తరుణ గణపతిని పూజించడమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ శ్లోకాలు ఏంటో ఓసారి చూద్దాం..

శ్లోకం :
పాశాంకుశాపూపకపిద్థజంబూ స్వదంతశాలీక్షుమపి
స్వహస్తై: ధత్తే సదా యస్తరుణారుణాభ:
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశ:

కోరిన కోర్కెలు తీర్చే వినాయకుడు :
ఈయనను ఇలా శ్లోకంతో పఠించడం ద్వారా కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయట..
నీలబ్జ దాడిమీ వీణా శాలినీ
గుంజాక్ష సూత్రకమ్ దధదుచ్ఛిష్ట
నామాయం గణేశ: పాతు మేచక:
అనే మంత్రంతో ప్రార్థించాలి