వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Tulasi plant : తులసి మొక్క విశిష్ట లక్షణాలు… మీకోసం !

Tulasi plant : తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ ... Read more

By Ramesh Babu

Published on: February 24, 2023 6:14 AM

Updated on: February 23, 2023 1:51 PM

interesting-details-about-tulasi-palnt

---Advertisement---

Tulasi plant : తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైన, పూజనీయమైన మొక్కగా భావిస్తారు. పవిత్రమైన ఈ మొక్కలు ప్రజలు తమ ఇంట్లో నాటి నీరు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తులసి మొక్క కుటుంబంలోని అన్ని ఆపదలను దూరం చేస్తుందని విశ్వసిస్తారు. అలాంటి తులసి మొక్కకు సంబంధించిన 5 ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

  • తులసి మొక్క 24 గంటలపాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్. దీనిని నాటిన చోట ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. ప్రతి రోజూ తులసి ఆకు రసాన్ని తాగితే చర్మవ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
  • గ్రహణానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలలో వేస్తారు. దీని వల్ల గ్రహణం ప్రభావం ఆహారంపై ఉండదని విశ్వాసం. ఆహారం స్వచ్ఛంగా ఉంటుంది. తులసిలో పాదరసం లాంటి రసాయనం ఉండటమే ఇందుకు కారణం. పాదరసంపై ఎలాంటి కిరణాల ప్రభావం ఉండదు.

    interesting-details-about-tulasi-palnt
    interesting-details-about-tulasi-palnt
  • పురాణాల ప్రకారం తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులసి దలం లేకుండా శ్రీహరి ఆరాధన ఎప్పటికీ సంపూర్ణం కాదు. అంతేకాదు.. తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాల ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు పరిఢవిల్లుతాయి.
  • ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో పసుపు రంగుతో తులసి వేరును ఉంచితే ఆ ఇంటిపై పిడుగు ప్రభావం ఉండదని చెబుతారు.
  • తులసిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. జలుబు, దగ్గు, దంత వ్యాధులు, శ్వాసకోశ వ్యాధుల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. తులసి ఇతర వ్యాధుల సంక్రమణను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Read Also : Vastu Tips : మీ వంట గదిలో ఈ చిట్కాలను పాటిస్తే… డబ్బుకు కొదువ ఉండదని తెలుసా ?

, , , , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel