Viral News: ప్రస్తుత కాలంలో ఎంతోమంది చాలా సులభంగా ప్రేమలో పడుతున్నారు అయితే వారి ప్రేమను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక బ్రేకప్ చెప్పుకోవడం, ఇలా బ్రేకప్ అయిన అనంతరం మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలు అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయిలు చావే శరణ్యం అనుకోని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల బెల్లంపల్లికి చెందిన తేజశ్రీ అనే యువతి రాజ్ కుమార్ అనే యువకుడిని గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలోని వీరిద్దరూ ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పెళ్లి విషయం వచ్చేసరికి రాజ్ కుమార్ కాస్త దూరంగా ఉండడంతో తాను మోసపోయానని గ్రహించిన తేజశ్రీ తనని పెళ్లి చేసుకోవాలని రాజకుమార్ ను బలవంతం పెట్టింది. దీంతో రాజ్ కుమార్ తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు.
Viral News : సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్..
ఇలా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో ఏం చేయాలో దిక్కు తెలియక తనని మర్చిపోలేక తేజశ్రీ ఎంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే తనకు చావే సరైనదని నిర్ణయించుకున్నటువంటి తేజశ్రీ సెల్ఫీ వీడియో తీసి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వీడియోలో భాగంగా తేజశ్రీ మాట్లాడుతూ ఎందుకు రాదు నేనేం పాపం చేశాను.. నువ్వే వచ్చి నన్ను కలిసావు. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు?నాకు చావే దిక్కు అంటూ ఈమె తన బాధను ఇలా వీడియో రూపంలో బయట పెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది.
Read Also : Viral Video : జాన్వీ కపూర్ గ్లామర్ షో.. ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది.. వైరల్ వీడియో..!