...

Crime News: అవినీతి పనులు చేస్తూ ఏసీబీ వాళ్లకు అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ..!

Crime News: పోలీసులంటే ప్రజలను రక్షించే వారని అర్థం. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది పోలీసులు వారిని రక్షించడం సంగతి మరచిపోయి ప్రజలను రాక్షసుల పట్టి పీడిస్తున్నారు. పోలీసులంటే గతంలో ఎంతో అభిమానం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది పోలీసులు చేస్తున్న పనులకు పోలీసు వ్యవస్థ సిగ్గు పడే పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల చట్టానికి విరుద్ధంగా లంచం తీసుకుంటూ ఏసీబీ వల కు ఒక ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు.

Advertisement

వివరాల్లోకి వెళితే… హోటల్ యజమాని బెదిరించి ఒక ఎస్ ఐ లంచం తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. చట్టాలను రక్షించాల్సిన పోలీసులే చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో రాజు గారి హోటల్ నిర్వాహకులను స్థానిక ఎస్ ఐ లవ్ కుమార్ లంచం కోసం బెదిరింపులకు పాల్పడ్డాడు.తన వేధింపులు చెప్పాలంటే భారీ మొత్తంలో తనకి లంచం ఇవ్వాలంటూ హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశాడు.

Advertisement

క్రమంలో హోటల్ కి సంబంధించి అన్ని అన్ని మాటలు సరిగ్గా ఉన్నా, అన్ని నిబంధనలు పాటిస్తున్నాకూడా ఎస్ఐ లంచం కోసం ఇబ్బంది పెడుతుండటంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలని హోటల్ యాజమాన్యం నిర్ణయించుకునీ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
అయితే సదరు ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పథకం వేశారు. శుక్రవారం ఎస్ ఐ లవ్ కుమార్ డ్యూటీ నుంచి రిలీవ్ అవుతూ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తున్న సమయంలో రూ 1.30 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement