Categories: CrimeLatest

Crime News: అక్కని వేధిస్తున్నాడని బావ మీద హత్యా ప్రయత్నం.. అడ్డుగా వచ్చిన బావ,అన్న మృతి..!

Crime News: ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల కారణంగా ఎదుటివారిని హత్యలు చేయటం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. తాజాగా భర్త భార్యను హింసిస్తున్నాడని బావమరుదులు చేసిన పని తీవ్ర కలకలం రేపింది.

Advertisement

వివరాలలోకి వెళితే…బాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేష్ పెయింటర్ గా పని చేస్తున్నాడు. తరచూ వెంకటేష్ తన భార్య రేఖను కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది వెంకటేష్ తన భార్యను కొట్టి సుభాష్ నగర్లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్ళాడు. రేఖ గొడవ జరిగిన విషయాన్ని తన సోదరులకు చెప్పగా.. ఉప్పల్ చిలుకానగర్ లో నివాసముంటున్న రేఖా సోదరులు వినయ్, మధు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన బావ ఆచూకీ తెలుసుకొని అతని వద్దకు వచ్చి తమ అక్కను ఎందుకు వేదిస్తున్నవ్ అంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది.

Advertisement

ఈ తరుణంలో బావ మీద కోపంగా ఉన్న మధు, వినయ్ వెంకటేష్ మీద కత్తులతో దాడి చేయటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి అడ్డుగా వచ్చిన వెంకటేష్ సోదరుడు పోతురాజు తీవ్రంగా కత్తిపోట్లు తగలటంతో అతను అక్కడికక్కడే మరణించాడు. వెంకటేష్, అతని స్నేహితుడు కృష్ణకు తీవ్రంగా గాయలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మరణించిన పోతురాజు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

CBSE Admit Card 2025 : సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…

2 days ago

NPS Zero Tax : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13.7 లక్షల జీతంపై జీరో పన్ను? ఈ పెన్షన్ విధానంతో సాధ్యమే.. తప్పక తెలుసుకోండి!

NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…

2 days ago

Vitamin E deficiency : మీ చేతులు, కాళ్ళు అకస్మాత్తుగా తిమ్మిరిగా మొద్దుబారుతున్నాయా? శరీరంలో ఈ విటమిన్ లోపమే.. లక్షణాలివే!

Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…

2 days ago

Lungs Detox : గోరువెచ్చని నీళ్లతో ఇది కలిపి తాగితే.. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన దుమ్ము, పొగ మొత్తం బయటకి వస్తాయి!

Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…

2 days ago

Ginger Benefits : ఆర్థరైటిస్, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పికి అల్లం పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…

2 days ago

Vasantha Panchami 2025 : వసంత పంచమి రోజు ఈ పరిహారాలు చేస్తే అదృష్టమే అదృష్టం..

Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…

6 days ago

This website uses cookies.