...

Crime News: అక్కని వేధిస్తున్నాడని బావ మీద హత్యా ప్రయత్నం.. అడ్డుగా వచ్చిన బావ,అన్న మృతి..!

Crime News: ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవల కారణంగా ఎదుటివారిని హత్యలు చేయటం లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారుతున్నారు. తాజాగా భర్త భార్యను హింసిస్తున్నాడని బావమరుదులు చేసిన పని తీవ్ర కలకలం రేపింది.

Advertisement

వివరాలలోకి వెళితే…బాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న వెంకటేష్ పెయింటర్ గా పని చేస్తున్నాడు. తరచూ వెంకటేష్ తన భార్య రేఖను కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది వెంకటేష్ తన భార్యను కొట్టి సుభాష్ నగర్లో ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్ళాడు. రేఖ గొడవ జరిగిన విషయాన్ని తన సోదరులకు చెప్పగా.. ఉప్పల్ చిలుకానగర్ లో నివాసముంటున్న రేఖా సోదరులు వినయ్, మధు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన బావ ఆచూకీ తెలుసుకొని అతని వద్దకు వచ్చి తమ అక్కను ఎందుకు వేదిస్తున్నవ్ అంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది.

Advertisement

ఈ తరుణంలో బావ మీద కోపంగా ఉన్న మధు, వినయ్ వెంకటేష్ మీద కత్తులతో దాడి చేయటానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి అడ్డుగా వచ్చిన వెంకటేష్ సోదరుడు పోతురాజు తీవ్రంగా కత్తిపోట్లు తగలటంతో అతను అక్కడికక్కడే మరణించాడు. వెంకటేష్, అతని స్నేహితుడు కృష్ణకు తీవ్రంగా గాయలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మరణించిన పోతురాజు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement