Telugu NewsCrimeViral news : అందమే ఆమెకు శాపం, భర్త అనుమానంతో చివరికి!

Viral news : అందమే ఆమెకు శాపం, భర్త అనుమానంతో చివరికి!

Viral news : అనుమానం పెనుభూతం. అది ఏ ఔషధానికి తగ్గని మాయదారి రోగం. అది మనసును దహించి వేస్తుంది. ఆ రోగం ఉన్న వారితో పాటు ఎదుటి వారు కూడా దానికి బలి కావాల్సిందే. నిద్ర పట్టనివ్వదు, సరిగ్గా తిననివ్వదు, ఏ పని చేసినా పరధ్యానం, అందుకే ఆ మాయదారి రోగం చాలా ప్రమాదకరం. దాంపత్య జీవితంలో అనుమానం అనే రోగం వస్తే.. అది ప్రాణాలనే బలిగొంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ అదే జరిగింది.

Advertisement
nizamabad husband killed his wife out of suspicion in nizamabad district snr nzb
nizamabad husband killed his wife out of suspicion in nizamabad district snr nzb

సయ్యద్ ఖలీం కూతురు అనీస్ ఫాతిమాకు 2013లో సయ్యద్ సుల్తాన్ తో వివాహం జరిగింది. సుల్తాన్ ఫాతిమా దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. అత్త కూడా ఫాతిమాను వేధించడంతో తరచూ ఇంట్లో గొడవలు అవుతుండేవి. వేధింపులు ఎక్కువ కావడంతో ఫాతిమా.. పిల్లలతో సహా వేరుగా ఉంటోంది. ఇలా ఉండగా.. సయ్యద్ ఫాతిమా ఉంటున్న గదికి వెళ్లి ఫాతిమాను చంపాడు. తర్వాత పిల్లలను తనతో తీసుకువెళ్తున్నానని తన మామకు ఫోన్ చేసి చెప్పాడు.

Advertisement

సయ్యద్ ఖలీం ఇంటికి వెళ్లి చూడగా.. మెడకు చున్నీ బిగించి ఉన్న ఫాతిమా విగత జీవిగా పడి ఉంది. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనుమానంతోనే తన కూతురుని అల్లుడు హత్య చేశాడని ఫిర్యాదు చేశాడు.

Advertisement

Read Also : Queen Elizabeth: క్వీన్ ఎలిజిబెత్ మరణాంతరం ఆకాశంలో చోటు చేసుకున్న అద్భుతం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు