Man attack: మాజీ ప్రేమికురాలిపై యువకుడి హత్యాయత్నం.. ఎందుకో తెలుసా?

Man attack: ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించానని వెంటపడ్డాడు. ఇప్పడేమో అదే అమ్మాయిని హత్య చేయబోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య వైద్య కళాశాల ఆవరణలో చోటుచేసుకుంది. మండ్య తాలుకా వై యరహల్లి గ్రామానికి చెందిన న్వయ మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేష్, న్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఏం అయిందో ఏమో కానీ నవ్య కొంత కాలంగా… పరమేష్ కు దూరంగా ఉంటోంది. ఏమైందంటూ పలు మార్లు నవ్య వెంట పడ్డాడు పరమేష్. ఫోన్లు చేస్తూ.. ఇంటి చుట్టూ తిరుగుతూ ఏమైందో కనుక్కునేందుకు చాలానే ప్రయత్నాలు చేశాడు.

Advertisement

Advertisement

తనను ప్రేమించి వదిలేసిందనే కోపంతో… పరమేష్ నవ్యను చంపాలని పథకం పన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం కళాశాల ఆవరణలోనే వేచి చూశాడు. నాలుగున్న గంటల ప్రాంతంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో… నవ్య తలపై బాదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన నవ్య అక్కడికక్కడే పడిపోయింది. విషయం గుర్తించిన విద్యార్థులు… ఆమెను ఆస్పత్రికి తరలించి పరమేష్ ను చితకబాదారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement