SI Harrasment : ఆడపిల్లలను రక్షించే పదవిలో ఉన్న ఓ అధికారే ఆమె పాలిట రాక్షసుడయ్యాడు. ఆ విషయాన్ని స్వయంగా బాధితురాలే బయటపెట్టింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్ స్పెక్టర్ పోలీసులు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి ట్రాప్ చేశాడు. ఆమెకు ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి పిలిపించుకొని మరీ ఉద్యోగానికి అవసరమైన మెటీరియల్స్, పుస్తకాలు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పాడు. అంతే కాదు బాధిత యువతికి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు
SI Harrasment : యువతిపై ఎస్ఐ అత్యాచారం…
ఆమె తనకు అలాంటివి ఇష్టం లేదని చెప్పిన వినకపోవడంతో… కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. దీంతో వీరంతా వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏఎస్ఐపై గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే వీరిచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఎస్ఐని విచారిస్తున్న సమాచారం. ఇటీవల చాలా మంది పోలీసులు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న మారేడ్ పల్లి సీఐ శ్రీనివాస్.. నిన్న మల్కాజ్ గిరి సీపీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్ కుమార్… ఇవాళ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో సబ్ ఇన్ స్పెక్టర్ ఇలా చాలానే బయటకు వస్తున్నాయి.
Read Also : Crime News : ఆ చిన్నారికి అరుదైన వ్యాధి.. బిడ్డ బాధ చూడలేక తల్లి ఏం చేసిందంటే..?