...

Kidnap: డబ్బుల కట్టలతో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన యువకుడు.. కిడ్నాప్ చేసిన దుండగులు!

Kidnap:ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ దగ్గర ఏదైనా కొత్త వస్తువు ఉన్న లేదా కొత్త బంగారు నగలు కొనుగోలు చేసిన వాటిని ఫోటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను ఎంతోమంది చూస్తారు. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజస్థాన్ లోని దౌసాలో అన్మోల్ అరోరా అనే యువకుడు నివసించేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్మోల్ తరచుగా తన దగ్గర ఉన్న డబ్బులను విలువైన వస్తువులను ఫోటోలు తీసి ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసేవాడు. అలాగే తను యాపిల్ ఫోన్ వాడుతున్నట్టు ఫోన్ చేతిలో పట్టుకున్న ఫోటోలను,ఇక తన బ్యాంక్ అకౌంట్ లో ఆరు లక్షల వరకు డబ్బులు ఉన్నాయని బ్యాంక్ ఖాతా స్క్రీన్షాట్ లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు తాను గొప్పలు పలికేవాడు.

ఇలా ఈ యువకుడు తన వద్ద ఉన్న సంపద గురించి అందరికీ తెలియజేయడంతో వివేక్ చతుర్వేది అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో అన్మోల్ అరోరాను కిడ్నాప్ చేయాలని పథకం వేశారు. పథకం ప్రకారం వివేక్ చతుర్వేది అన్మోల్ అరోరాను కిడ్నాప్ చేసి తనని విడిచి పెట్టాలంటే కోటి రూపాయలు కావాలని బాధిత కుటుంబానికి డిమాండ్ చేశారు.ఇక ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు వివేక్ చతుర్వేది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.