...

Love Tragedy : 4 ఏళ్ల ప్రేమ.. నిశ్చితార్థం.. చివరికి ఏం జరిగింది..?

Love Tragedy : తమిళనాడులోని మయిలదుతురై జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తూ లాయర్ తో నోటీసులు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మయిలదుతురై జిల్లాలోని బాలాజీ నగర్ కు చెందిన ముత్తయ్య కూతురు దుర్గాదేవి. పీజీ చదివిన ఆమె ఆడిటర్ వద్ద ఆడిట్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో..మయిలదుతురైలో ఓ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న రాజేష్ అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్ళకు స్నేహం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడడంతో ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి ఒప్పుకున్నాయి. దుర్గాదేవి,రాజేష్ లకు ఇరు కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే ఇదంతా జరిగాక.. రాజేష్ వాళ్ళ కుటుంబం దుర్గాదేవికి ఊహించని షాక్ ఇచ్చారు. పెళ్లికి నో చెప్పారు. ఏంటని అడిగితే.. కట్నం మరికొంత కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాజేష్ సెంబనార్కోయిల్ కు ఉద్యోగ రీత్యా బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో సెంబనార్కోయిల్ పోలీసులకు దుర్గాదేవి కుటుంబం వారు కంప్లైంట్ చేశారు. నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కాంప్రమైజ్ కావాలని చెప్పారు.

దీంతో రాజేష్ తరపు లాయర్ దుర్గాదేవి ఇంటికి నోటీసులు పంపారు. ఆ నోటీసులో రాజేష్ వెర్షన్ చెప్పుకొచ్చిన సందర్భంలో.. కొందరు మగాళ్లతో క్లోజ్ గా మాట్లాడటం తనకు నచ్చలేదని.. అందుకే తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. పెళ్లి చేసుకోలేనని దుర్గాదేవిపై పరోక్షంగా రాజేష్ అనుమానం వెలిబుచ్చాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గాదేవి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. చీమల మందును తిని ఆత్మహత్య చేసుకున్న ఆమెను తొందరగా ఆస్పత్రికి తరలించారు.

మయిలదుతురై ప్రభుత్వ హాస్పిటల్ లోని ఐసీయూలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే రాజేష్ చేసిన పని వల్లనే,వాళ్ల కూతురు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజేష్ మరియు అతని కుటుంబం తరపు వాదన వేరేలా ఉంది. ప్రేమ పేరుతో దుర్గాదేవి డబ్బు కోసం రాజేష్ ను వాడుకుని, ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని రాజేష్ అడిగినందుకు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం పేరుతో వ్యవహారాన్ని తప్పుదారి పట్టిస్తోందని చెప్పుకొచ్చారు.మయిలదుతురై పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు కుటుంబాల్లో ఎవరి వాదనలో నిజముంది అనేది త్వరలోనే బయట పడుతుందని పోలీసులు చెప్పారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న దుర్గాదేవి కి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Read Also : Hero Siddarth : వివాదంగా మారిన సిద్దార్థ్ ట్విట్..మహిళా కమిషన్ ఆగ్రహం..!