...

Hyper Aadi : హమ్మయ్య.. వచ్చాడు వచ్చాడు.. శ్రీదేవి డ్రామా కంపెనీకి పూర్వ వైభవం….

Hyper Aadi : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ఈ స్తాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ షో లో ఉన్న కమెడియన్స్ అంతా కలిసి చేస్తున్న కామెడీ కం ఇంట్రెస్టింగ్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్ రేంజ్ లో కాకున్నా ఆ షో కి కూడా మంచిగా రేటింగ్ వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ఎక్కువ శాతం రామ్‌ ప్రసాద్‌, ఆది కామెడీ పని చేస్తుంది అంటూ అంతా కామెంట్ చేస్తూ ఉంటారు.

Advertisement

గత రెండు ఎపిసోడ్లు గా హైపర్ ఆది లేకపోవడంతో అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెడీ లేదు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్ చేశారు. హైపర్ ఆది కావాలి అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా పెద్ద డిమాండ్ చేశారు అనడంలో సందేహం లేదు. యూట్యూబ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క ప్రతి వీడియో కు హైపర్ ఆది కావాలి అంటూ కామెంట్ చేశారు.

Advertisement
hyper-aadi-came-back-to-sridevi-drama-company-show
hyper-aadi-came-back-to-sridevi-drama-company-show

హైపర్ ఆది ఉంటేనే శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తామని చాలా మంది కూడా అన్నారు. పారితోషికం తక్కువ ఉన్న కారణంగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి తప్పుకున్నాడు అంటూ వచ్చిన వార్తలు తప్పు అని నిరూపితమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులను కలిసేందుకు హైపర్ ఆది వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement

తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చే వారం (sridevi drama company Promo) ప్రోమోలో హైపర్ ఆది కనిపించడంతో ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. వచ్చే వారం శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించి మంచి రేటింగ్ ను ఈ వర్షిప్ దక్కించుకుంటుంది అంటూ మీడియా వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also : Kacha Badam Telugu Version : కచ్చా బాదమ్ తెలుగు వెర్షన్ ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అచ్చ తెలుగులో దుమ్ములేపుతుందిగా.. వీడియో!

Advertisement
Advertisement