Kacha Badam Singer : కచ్చా బాదమ్ పాట.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ కచ్చా బాదమ్ మానియా నడుస్తోంది. అంతగా పాపులర్ అయింది ఈ పాట.. బైకుపై వీధి వీధి తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే వ్యక్తి ఈ పాటను రాశాడు. అతడే.. పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ కు చెందిన భుబన్ బద్యాకర్.. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఈ బద్యాకర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. తన కారు డ్రైవ్ చేస్తుండగా ఛాతికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇటీవలే సెకండ్ కారును కొనుగోలు చేసిన బద్యాకర్.. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ప్రమాదం జరిగింది. వెంటనే ఓ సూపర్ స్పెషల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కచ్చా బాదమ్ సింగర్ బద్యాకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

బెంగాలీలో పాడుకునే ఈ పాటకు ట్యూన్ కట్టిన బద్యాకర్.. పల్లీలు అమ్మేటప్పుడు పాడుతుంటాడు. అలా పాడుతుండగా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. అప్పటినుంచి ఎక్కడ చూసినా.. కచ్చా బాదమ్ సాంగ్ చక్కర్లు కొడుతోంది.
ఈ కచ్చా బాదమ్ పాటతో రాత్రికిరాత్రే.. సెన్సెషనల్ స్టార్ అయాడు చిరు వ్యాపారి భుబన్ బద్యాకర్.. ఇకపై పల్లీలు అమ్మడం మానేస్తానని చెప్పాడు. ఇటీవల చాలా ఆల్బమ్స్ లో కూడా తన పాటను పాడి మరింత ఆకట్టుకుంటున్నాడు. బద్యాకర్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. బాలీవుడ్ ఇతర ప్రైవేట్ ఆల్బమ్ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టీవీ షోలలో కూడా కనిపిస్తూ తన పాటతో అందరిని అలరిస్తున్నాడు బద్యాకర్..
Read Also : Jabardasth Varsha: వర్ష అసలు అమ్మాయేనా? అంటూ వర్ష పరువు తీసిన ఇమ్మాన్యుయేల్ తల్లి…!