Personal Loan : పర్సనల్ లోన్ కావాలా? ఈ 10 బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Personal Loan : పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం ఈ పండుగ సీజన్‌లో SBI, HDFC సహా 10 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అద్భుతమైన ఆఫర్లతో పర్సనల్ లోన్లను అందిస్తున్నాయి. EMI, ఆఫర్లు, ఏ బ్యాంకు నుంచి ఎంత మొత్తంలో లోన్ చౌకగా లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) :
PNB వ్యక్తిగత రుణాలపై 10.50శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. రూ. 5 లక్షల రుణానికి 5 ఏళ్లలో నెలకు EMI రూ. 10,747 అందిస్తుంది. పండుగల సమయంలో ప్రాసెసింగ్ ఫీజులు కూడా మాఫీ అవుతాయి. ఈ బ్యాంకు ముఖ్యంగా మెట్రోలు, టైర్-2 నగరాల్లోని వినియోగదారులకు అందిస్తుంది.

Personal Loan : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :

వ్యక్తిగత రుణాలపై యూనియన్ బ్యాంక్ 10.75శాతం నుంచి వడ్డీ రేట్లు వసూలు చేస్తుంది. 5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణానికి ఈఎంఐ రూ. 10,809 ఉంటుంది. నిపుణులు జీతం పొందే కస్టమర్లకు బ్యాంక్ వేగంగా అప్రూవల్ అందిస్తుంది. తక్కువ డాక్యుమెంటేషన్ కావడంతో ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.

Advertisement

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) :
BoB పర్సనల్ లోన్ 10.90శాతం వడ్డీ రేటుతో ప్రారంభమవుతుంది. 5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణానికి EMI రూ. 10,846కు పొందవచ్చు. ఈ బ్యాంక్ డిజిటల్ ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. లోన్ అప్రూవల్ త్వరగా జరిగేలా చేస్తుంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రత్యేక రేట్లు, ఆఫర్లు వర్తిస్తాయి.

కెనరా బ్యాంక్ :
కెనరా బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేటు 13.75శాతం నుంచి ప్రారంభమవుతుంది. 5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణానికి EMI రూ. 11,569 పొందవచ్చు. వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, పాత కస్టమర్లకు ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Personal Loan : యాక్సిస్ బ్యాంక్ :

వ్యక్తిగత రుణాలపై 9.99 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. 5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణానికి EMI రూ. 10,621. ఫాస్ట్ పేమెంట్, తక్కువ ప్రాసెసింగ్ సమయం అందిస్తుంది. పండుగల సమయంలో బ్యాంక్ ప్రత్యేక డిజిటల్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది.

Advertisement

Read Also : SBI IMPS : గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి SBI IMPS లావాదేవీ ఛార్జీల్లో మార్పులు.. ఏయే కస్టమర్లకు వర్తిస్తాయంటే?

ICICI బ్యాంక్ :
ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్‌పై 10.60శాతం నుంచి వడ్డీ రేట్లు అందిస్తుంది. రూ. 5 లక్షల రుణానికి EMI 5 ఏళ్లలో రూ. 10,772కు అందిస్తోంది. ఈ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా ఇన్‌స్టంట్ అప్రూవల్, లోన్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. అధిక ఆదాయ గ్రూపు కస్టమర్లలో చాలా డిమాండ్ ఉంది.

HDFC బ్యాంక్ :
HDFC బ్యాంక్ వ్యక్తిగత రుణ వడ్డీ రేటు 10.90శాతం నుంచి ఉంటుంది. రూ. 5 లక్షల రుణానికి 5 ఏళ్లకు EMI రూ. 10,846 అందిస్తోంది. ఈ బ్యాంక్ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు, ఫ్లెక్సీ పేమెంట్ ప్లాన్లను అందిస్తుంది. లోన్ ప్రాసెస్ స్పీడ్ ఉంటుంది. ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది.

Advertisement

Personal Loan : కోటక్ మహీంద్రా బ్యాంక్ :

కోటక్ బ్యాంక్ పర్సనల్ లోన్‌పై 10.99శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. 5 ఏళ్లకు రూ. 5 లక్షల రుణానికి EMI రూ. 10,869కు అందిస్తోంది. వెంటనే లోన్ అప్రూవల్ వస్తుంది. పండుగల సమయంలో ప్రాసెసింగ్ ఫీజులను కూడా మాఫీ చేస్తుంది.

యస్ బ్యాంక్ :
పర్సనల్ లోన్లపై 11.25శాతం నుంచి వడ్డీ రేట్లు అందిస్తోంది. రూ. 5 లక్షల రుణానికి 5 ఏళ్లలో రూ. 10,934 ఈఎంఐ అందిస్తోంది. డిజిటల్ అప్లికేషన్, త్వరిత పేమెంట్ పొందవచ్చు. వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. పండుగల సమయంలో ఆఫర్లతో పొందవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel