Driving License Online : మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారా? ఆన్‌లైన్‌లో ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీగా పూర్తి చేయొచ్చు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ 20 ఏళ్లు లేదా డ్రైవర్‌కు 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో మీ లైసెన్స్ వ్యాలిడిటీ గడువు ముగియబోతుంటే వెంటనే రెన్యువల్ చేయించుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేసేందుకు ఆన్‌లైన్ మెథడ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Driving License Online : డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటివరకు రెన్యువల్ చేయొచ్చంటే? :
మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియనుందా? చెక్ చేసుకోండి. లేదంటే ఇప్పటికే గడువు ముగిసిపోయిందా? అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ గడువు మళ్ళీ పెంచుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒక ఏడాది పాటు రెన్యువల్ చేయించుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది.
కానీ, మీరు ఒక ఏడాది లోపు మీ లైసెన్స్‌ను రెన్యువల్ చేయకపోతే శాశ్వతంగా రద్దు అవుతుంది. అప్పుడు మీరు మళ్ళీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇంటి నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు RTO ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఈ పనిని ఆన్‌లైన్‌లోనే ఇంటి దగ్గర నుంచి చాలా సులభంగా పూర్తి చేయవచ్చు.

Driving License Without RTO : డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లో ఎలా రెన్యువల్ చేయాలి? :
- ముందుగా, మీరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ వెబ్‌సైట్ (https://parivahan.gov.in/)కి వెళ్లాలి.
- మీ రాష్ట్రం పేరును ఎంచుకోవాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సర్వీసు (Renewal Service)పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీరు అవసరమైన సమాచారాన్ని నింపాలి.
- గుర్తింపు కార్డు, పాత లైసెన్స్ ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- మీరు ఫొటో, డిజిటల్ సైన్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సమాచారం మొత్తం నింపి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించాలి.
- ఆ తర్వాత కొత్త డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వస్తుంది.
FAQs : Get Driving License Online Without Visiting RTO
1. RTO ఆఫీసు వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చా?
Ans : లేదు. డ్రైవింగ్ టెస్టింగ్ నేరుగా పూర్తి చేయాలి. కానీ, మిగతా అన్ని పనులను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.
2 : ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ (DL) అప్లికేషన్ అన్ని రాష్ట్రాలలో ఉందా?
అవును.. చాలా రాష్ట్రాలు పరివాహన్ ద్వారా అందుబాటులో ఉంది. కానీ, కొన్నింటికి ఆయా రాష్ట్రాల సొంత పోర్టల్‌లు ఉన్నాయి.
3 : డ్రైవింగ్ లైసెన్స్ ఎన్నిరోజులకు వస్తుంది?
డ్రైవింగ్ టెస్టులో పాస్ అయ్యాక లైసెన్స్ సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లో ఇంటికి వస్తుంది.
4 : ఫిజికల్ డాక్యుమెంట్లను సమర్పించాలా?
అవసరం లేదు. మీరు ఆధార్, ఇతర ఇ-డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఫిజికల్ డాక్యుమెంట్ల సమర్పణ అక్కర్లేదు.
















