...

Sudigali Sudheer : సుడీగాలి సుధీర్‌పై నాగబాబు సీరియస్..? జనాలు ఏమైనా పిచ్చోళ్లనుకుంటున్నారా..!

Sudigali Sudheer : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులోని కమెడియన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు సాదాసీదాగా ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు. మల్లెమాల ప్రొడక్షన్‌లో ఈ కామెడీ షో వలన ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. చాలా మంది కొత్త కామెడీ ఆర్టిస్టులు కూడా వెలుగులోకి వచ్చారు. వారికి ఇది ఒక ప్లాట్ ఫాంగా నిలిచింది. జబర్దస్త్ కామెడీలో సుడీగాలి సుధీర్ టీం గురించి తెలియని వారుండరు. ఇందులో ఆటో రామ్ ప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను అప్పుడప్పుడు మధ్యలో సన్నీ వచ్చి యాడ్ అవుతుంటాడు.

Advertisement

ముఖ్యంగా సుధీర్, శ్రీను, రాంప్రసాద్ వీరు చేసే కామెడీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరి స్కిట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదరుచూస్తుంటారు. అంతలా నవ్వులు పూయిస్తుంటారు ఈ ముగ్గురు. జబర్దస్త్  కామెడీ షో టీఆర్పీ రేటింగ్‌లోనూ దూసుకుపోతుంది. సూపర్ హిట్ ప్రోగ్రామ్స్‌ను కూడా బీట్ చేసి టాప్‌లో కొనసాగుతోంది. అయితే, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వెళ్తున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.  ఈ క్రమంలోనే మొన్న వచ్చిన ఓ స్కిట్‌‌లో తాము జబర్దస్త్‌ను వీడి వెళ్తున్నామని చెప్పి సుధీర్ కంటతడి పెట్టాడు. అందరూ అదే నిజం అనుకున్నారు. కానీ ఆ తర్వాత వారు అబద్ధం చెప్పి జనాలను ఫూల్స్ చేశారని తెలిసింది.

Advertisement

ఈ విషయం తెలిసి  జబర్దస్త్ షోపై, సుడీగాలి సుధీర్ టీంపై మండిపడుతున్నారు. మీ టీఆర్పీ రేటింగ్స్ కోసం జనాల ఎమోషన్స్‌తో ఆడుకుంటారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నాగబాబు వద్దకు వెళ్లడంతో ఆయన కూడా సుడీగాలి సుధీర్ టీంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. జనాలు ఏమైనా పిచ్చోళ్లు అనుకుంటున్నారా? అంటూ  ఫైర్ అయ్యారట..  ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : షన్నూ అలాంటి వాడే అంటూ కాజల్ కామెంట్లు.. ఏమన్నదో తెలిస్తే..

Advertisement
Advertisement