Lakhpati Didi Scheme : ఇది మహిళల కోసమే.. రూ. 5 లక్షల వరకు లోన్.. వడ్డీ కట్టనక్కర్లేదు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Updated on: February 15, 2025

Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు అద్భుతమైన (Women Loan Scheme) ప్రయోజనాలను పొందవచ్చు. మహిళలకు ఆర్ధిక సాయం అందించడమే లక్ష్యంగా ఈ కొత్త స్కీమ్ (How to Apply for Lakhpati Didi Scheme)  అందుబాటులోకి వచ్చింది. ప్రతి మహిళ ఎవరిపై డిఫెండ్ కాకుండా తమ సొంత కాళ్ల మీద తాము నిలబడి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ స్కీమ్ అద్భుతంగా సాయపడుతుంది.

ఏదైనా వ్యాపారం చేయాలంటే అందరికి ముందుగా లోన్లు కావాలి. ఆ లోన్ల కోసం ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. చాలామంది ఈ వడ్డీలకు భయపడి రుణాలను తీసుకునేందుకు భయపడుతుంటారు. ఇకపై అలాంటి భయమే లేకుండా మహిళలందరూ ‘లక్‌పతి దీదీ యోజన’ అనే పథకం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలు లక్షాధికారులుగా మారేందుకు అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

Lakhpati Didi Scheme :  రూ. 5 లక్షల లోన్.. రూపాయి వడ్డీ కూడా ఉండదు

అర్హత కలిగిన మహిళలకు రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. పైగా ఈ లోన్ తీసుకుంటే రూపాయి వడ్డీ కూడా కట్టనక్కర్లేదు అనమాట. లోన్ తీసుకున్న మొత్తాన్ని నిర్ణీత గడువు తేదీలోగా చెల్లించాలి. ఈ స్కీమ్ మహిళలను సొంతంగా వ్యాపారం చేసేందుకు వీలుగా ఉంటుంది.

Advertisement

అంతేకాదు.. ఈ పథకంలో భాగంగా మహిళల కోసం ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. వ్యాపార పరంగా ఎదిగేందుకు ఈ ట్రైనింగ్ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2023 ఆగస్టులో ఈ పథకం ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు కోటి మంది మహిళలు లబ్దిపొందారు. ప్రారంభంలో 2 కోట్ల మంది లక్ష్యంతో స్కీమ్ ప్రారంభమైంది. ఇప్పుడు అది కాస్తా 3 కోట్ల మందికి విస్తరించింది.

Read Also : Tea Side Effects : టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ వ్యక్తులకు ప్రాణాంతకం కావచ్చు!

ఈ స్కీమ్ ద్వారా మహిళలు శిక్షణ పొందుతారు. ఏదైనా బిజినెస్ ప్రారంభించి అవసరమైన రుణం తీసుకోవచ్చు. ఇంతకీ ఈ లోన్ పొందాలంటే డాక్యుమెంట్లు సమర్పించాలి. అందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్‌కం ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ తప్పనిసరిగా సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. మీ లోన్ అప్రూవల్ అయితే మహిళలకు రూ. 5 లక్షల వరకు లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సొంత బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.

Advertisement

ఎవరు అర్హులు? :

ఈ పథకం కింద మీరు మహిళలు సులభంగా రుణం పొందవచ్చు . 18 ఏళ్ల వయస్సు నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఏ మహిళ అయినా ప్రభుత్వ లక్‌పతి దీదీ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కోసం, మహిళ ఆ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. స్వయం సహాయక బృందంతో అనుబంధం కలిగి ఉండటం తప్పనిసరి.

వ్యాపారం ప్రారంభించడానికి రుణం పొందడానికి, మీరు మీ ప్రాంతీయ స్వయం సహాయక సంఘ కార్యాలయంలో అవసరమైన పత్రాలు, వ్యాపార ప్రణాళికను సమర్పించాలి. ఆ తరువాత, దరఖాస్తు సమీక్షించి ఆమోదిస్తారు. ఆ తరువాత రుణం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ రుజువు, బ్యాంక్ పాస్‌బుక్ కాకుండా, దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను కూడా సమర్పించాలి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel