Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే ఉంటాం. మన శరీరం చురుకుగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఖనిజం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. నీరు లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. ఈ విషయం తెలిసినా చాలా మంది తక్కువ నీళ్లను తాగుతున్నారు.
దీని కారణంగా, వారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి. నీటి కొరత వల్ల మీకు కిడ్నీలో (avoid kidney stones) రాళ్ల సమస్యకు దారితీస్తుందని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి అతి పెద్ద కారణం తక్కువ నీరు తాగడమే. నీటి కొరత ఎందుకు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు రోజుకు ఎంత నీరు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎప్పుడు వస్తాయి? :
మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. సోడియం, కాల్షియం, ఇతర సూక్ష్మ కణాలను మూత్రనాళం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. కానీ, ఈ ఖనిజాలు మన శరీరంలో అధికంగా మారినప్పుడు, కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. వాటిలో పేరుకుపోయి రాళ్ల మాదిరిగా మారిపోతాయి.
కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం :
తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడటమే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతుంది. వాస్తవానికి, తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని లవణాలు, ఖనిజాలు స్ఫటికాలుగా మారుతాయి. తద్వారా రాళ్లంగా మారిపోతాయి. దాంతో కడుపు నొప్పికి కారణమవుతుంది. కొన్నిసార్లు మూత్రవిసర్జనలో ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది.
రోజుకు ఎంతమొత్తంలో నీరు తాగాలంటే?:
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా ఫ్యామిలీ హిస్టరీలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు రోజుకు కనీసం 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. పొలంలో పనిచేస్తే ఇంకా ఎక్కువ తాగాలి. అలాగే ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. చికెన్, మాంసం తక్కువగా తినండి. ఎక్కువ నీరు తాగడం ద్వారా మూత్రపిండాలు ఈ ఖనిజాలను ఫిల్టర్ చేస్తాయి. దీని కారణంగా రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
Read Also : Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world