Moosapet Murder : అతడికి భార్యపై అనుమానం.. ఆమె ప్రతి కదిలికను అనుమానించేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. ఎవరివైపు చూసినా అక్రమ సంబంధాన్ని అంటగట్టేవాడు. అతడి వేధింపులు అంతటితో ఆగలేదు. ఏకంగా ఆమెను అతిదారుణంగా హత్యచేసేంతవరకు తీసుకొచ్చింది. భార్యను ఇంట్లోనే గొంతునులిమి చంపేసి గదికి తాళం వేసి పారిపోయాడో భర్త.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట ప్రాంతంలో వెలుగుచూసింది.
భార్యపై అనుమానమే అతడ్ని హంతకుడిగా మార్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన 21ఏళ్ల యువతి పుణ్యవతి అలియాస్ భవాని శిరీష, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28ఏళ్ల సంతోష్‌కు గత మే నెలలో వివాహమైంది. కొన్నాళ్లు బాగానే అన్యోన్యంగా ఉన్నారు. భార్యతో హైదరాబాద్ వచ్చి మూసాపేటలోని గూడ్స్ షెడ్ వద్ద వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు. రానురాను.. అతడిలోని అనుమానపు సైకో బయటకు వచ్చాడు. వెల్డింగ్ షాప్ ఎదురుగా ఉండే ఇంట్లోనే అద్దెకు దిగిన సంతోష్.. తన భార్యపై అనుమానంతో.. 6 నెలల్లో 4 ఇల్లులు మారాడు.
Moosapet Murder : భార్య పుణ్యవతి గొంతునులిమి హత్య..
రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ చోటచేసుకుంది. ఆవేశంలో విచక్షణ లేకుండా భార్య గొంతునులిమి హత్యచేశాడు. ఆపై మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి తాళం వేసి పారిపోయాడు.. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చారు. తాళం వేసి ఉండటం గమనించి దాన్ని పగలగొట్టేశారు.
లోపలికి వెళ్లి చూడగా విగతజీవిగా భవానీ శిరీష మృతదేహం నేలపై పడి ఉంది. మృతురాలి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పుణ్యవతి మృతురాలి గొంతు, ముఖంపై గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్ కోసం గాలిస్తున్నారు.
తాళం వేసి ఉండటంతో పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా శిరీష మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకి పంపారు. గురువారం మధ్యాహ్నం హత్యచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గొంతు, మొహంపై గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world