Guppedantha Manasu జనవరి 30 ఎపిసోడ్ : వసుని ఊరు విడిచి వెళ్లిపోమని చెప్పిన దేవయాని.. వసు దగ్గరికి బయలుదేరిన రిషి?

Guppedantha Manasu జనవరి 30 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార చక్రపాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధారతో గడిపిన క్షణాలు,వసుధార అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అంత జరిగిన కూడా అసలు ఏమీ జరగనట్టు ఎలా మాట్లాడుతున్నావు వసుధార నువ్వు ఇలాంటి పరిస్థితి తెస్తావని నేను నిన్ను ఇన్ని మాటలు అనాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. దీనికి అంతటికి నువ్వే కారణం కదా. ఇన్ని రోజులు నువ్వు చూపించిన ప్రేమ అంతా ఒట్టి నాటకమేనా అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. అన్ని జ్ఞాపకాలను అందించావు చివరికి నీ ఇష్టం అన్నావు అనుకుంటూ వసుని తలుచుకొని పదేపదే బాధపడుతూ ఉంటారు రిషి.

devayani give to blank check to vasu in todays guppedantha manasu serial episode
devayani give to blank check to vasu in todays guppedantha manasu serial episode

మరొకవైపు వసుధార జగతి ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మహేంద్ర చక్రపాణి గారు వచ్చినప్పుడు ఆయన మాట ఉంటే బాగుండు జగతి అని మహేంద్ర అనగా అప్పుడు వెంటనే జగతి ఆయనను చూడగానే నాకు కోపం వచ్చింది మహేంద్ర అయినా కూడా దేవయాని అక్కయ్య వస్తే పెద్ద గొడవ జరుగుతుందని పంపించేసాము కదా అనడంతో ఆ మాటలు విన్న దేవయాని అక్కడికి చప్పట్లు కొడుతూ వస్తుంది. ఆదిదంపతులు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అనగా వెంటనే మహేంద్ర అక్కయ్య గోడ చాటున ఉండి మా మాటలు వింటున్నారా అనడంతో వెంటనే జగతి ఇంకా ఆ అలవాటు మానుకోలేదా అక్కయ్య అని అంటుంది.

Advertisement
PM Kisan 22nd installment
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

అప్పుడు దేవయాని నేను ఆ మాటలు వినడానికే కదా ఉండేది అని అంటుంది. చక్రపాణి ఇంటికి వచ్చినప్పుడు నేను అతని అడిగి నిజాలు తెలుసుకుంటానని చెప్పి అతను పంపించేశారు అసలు మీకు సిగ్గు ఉందా. రిషి ఈరోజు ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి ,ఇదంతా జరగడానికి మీ ఇద్దరే కారణమని వారిపై సీరియస్ అవుతుంది దేవయాని. అప్పుడు జగతి మర్యాదగా మాట్లాడండి అక్కయ్య అనడంతో ఇంకా మర్యాద ఏంటి జగతి నేను ఆరోజు సాక్షిని పెళ్లి చేసుకోమంటే మీరిద్దరూ వసుధారని తీసుకొచ్చి అంటగట్టారు అది ఈరోజు మీ మీద సీరియస్ అయింది అంటుంది దేవయాని. రిషి ని చిన్నప్పటి నుంచి పెంచింది పెద్ద చేసింది నేను నువ్వు మధ్యలోనే వచ్చావు దానికి సంతోషించు అని అంటుంది.

అసలు రిషి ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు మీకేం పట్టడం లేదా ఇద్దరు జంట పక్షుల్లాగా చేతులు పట్టుకొని ఇంట్లో కాలేజీ బయట ఎక్కడ చూసినా మీరే కనిపించడం కాదు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది. మిమ్మల్ని నమ్ముకుంటే పనులు కావు ఎలా అయినా రిషి ఇంటికి రప్పిస్తాను అనగా అక్కయ్య వద్దు అనడంతో జగతి నువ్వేం మాట్లాడకు అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని రిషి ఫోన్ చేయక రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదంతా మీ వల్లే ఎలాగైనా రిషి ని పిలుచుకో వస్తాను అని దేవయాని అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు జగతి మహేంద్రా దేవయాని అక్కయ్య వెళ్తే రిషిని మరింత డిస్టర్బ్ చేస్తుంది అనుకోని వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు.

Guppedantha Manasu january 30 Today Episode : వసు దగ్గరికి బయలుదేరిన రిషి..

మరోవైపు వసుధార చక్రపానికి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు చక్రపానికి తాను రిషి పెద్దమ్మని రిషి ని పెంచి పెద్దది చేసింది తానే అని చెబుతుంది. అప్పుడు దేవయాని వసుధార రిషి ఎక్కడ ఉన్నాడు అనడంతో రిషి సార్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు మేడం ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటుంది. అప్పుడు దేవయాని ఇక స్ట్రైట్ గా మాట్లాడుకుందాం వసుధార. అసలు ఏం జరిగిందో నువ్వు అలా ఎందుకు ప్రవర్తించావో నీకు మాత్రమే తెలుసు అనగా అది నాకు రిషి సార్ కి తెలిస్తే చాలు మేడం అనగా ఈ పొగరు తగ్గించుకో వసుధార అంటుంది దేవయాని.

Advertisement
Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఇప్పుడు దేవయానికి వసుధర బ్లాంక్ చెక్ ఇచ్చి ఇందులో ఎంతైనా రాసుకో వసుధార ఈ ఊరి విడిచి వెళ్ళిపో అనడంతో వసుధర చక్రపాణి ఇద్దరు శాఖ అవుతారు. అప్పుడు నాన్న తర్వాత మీకు జరిగింది మొత్తం చెప్తాను. మీరు లోపలికి వెళ్ళండి అనడంతో చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసుధార మేడం మీరు వచ్చిన దారిన వెళ్లిపోండి మర్యాదగా చెబుతున్నాను అనడంతో చెక్ బుక్ ఇస్తుండగా వసుధార మాత్రం తీసుకోదు. సరే వసుధార మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్లి వచ్చి ఏదో ఒక మాట చెప్పు అంతవరకు ఇక్కడే ఉంటాను అంటుంది దేవయాని.

మరోవైపు జగతి మహేంద్ర రూమ్ కి వెళ్ళగా అక్కడ రిషి లేకపోవడంతో టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఆ తర్వాత వసుధారా మహేంద్ర కి ఫోన్ చేయడంతో మహేంద్ర చేతుల నుంచి రిషి మొబైల్ ఫోన్ లాక్కుంటాడు. అప్పుడు నాన్న పెద్దమ్మ అక్కడికి వెళ్లి గొడవ చేస్తూ ఉన్నారని అక్కడికి వెళ్తాను అని చెప్పే రిషి వసుధార దగ్గరికి బయలుదేరుతాడు.

Read Also : Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : రిషిని హత్తుకొని ఎమోషనల్ అయిన మహేంద్ర.. రిషిని రెచ్చగొడుతున్న దేవయాని?

Advertisement
IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel