Priyanka Jawalkar : ఆ డైరెక్టర్స్‌పై ప్రియాంక జువాల్కర్ సంచలన కామెంట్స్.. నేను అందుకే పనికొస్తానని అన్నారు..!

Telugu-Beauty-Priyanka-jawa
Telugu-Beauty-Priyanka-jawa

Priyanka Jawalkar : తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో నటి ‘ప్రియాంక జువాల్కర్’ ఒకరు.. ఈ నటి అచ్చ తెలుగు హీరోయిన్. ఏపీలోని అనంతపూర్ జిల్లాలో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన తెలుగు బ్యూటీ తొలిసారిగా ‘టాక్సీవాలా’ మూవీలో హీరో ‘విజయదేవర కొండ’కు జోడిగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రియాంకకు వరుసగా సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. బ్యాక్ టు బ్యా్క్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారిపోయింది. ఇటీవల ఎస్ ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక గమనం సినిమాలో నటించింది.

ఈ మూవీని మహిళా డైరెక్టర్ సంజనా రావు తెరకెక్కించారు. గమనం సినిమా ఈ నెల10న ప్రేక్షకుల ముందుకు రానున్నది. అయితే, గమనం మూవీలో తన ప్లే చేసిన రోల్‌కు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఇందులో తనకు పెద్దగా డైలాగ్స్ ఏమీ ఉండవని తెలిపింది. సినిమాలో ఎక్కువ శాతం కళ్లతోనే నటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలాంటి పాత్రను తాను ఎందుకు ఎంచుకున్నానో వివరణ కూడా ఇచ్చింది ప్రియా..

Advertisement

తన కెరీర్ ఇప్పటివరకు చేసిన సినిమాలు నటనకు ప్రాధాన్యం ఉన్న పిక్చర్స్ కావని తెలిపింది. నటనకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ చేస్తే మిగతా డైరెక్టర్స్ కూడా తనకు మంచి పాత్రలు ఇస్తారని వెల్లడించింది.అయితే, తను కేవలం కమర్షియల్ చిత్రాలకు మాత్రమే పనికొస్తానని అందరూ అనుకుంటున్నారు. మూవీస్‌లో పల్లెటూరి అమ్మాయి పాత్రలు ఇవ్వమని అడిగితే.. నువ్వు చాలా తెల్లగా ఉన్నావు.. ఇలాంటి పాత్రలకు సెట్ అవ్వను అంటూ కొందరు దర్శకులు నన్ను రిజక్ట్ చేశారని చెప్పుకొచ్చింది ప్రియాంక. కాగా, ముందుగా తాను నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికి ముందుంటానని తెలిపింది.

Read Also : Singer Chinmayi : సింగర్ చిన్మయిని గలీస్‌గా బూతులు తిట్టిన ఎన్నారైలు.. ఎందుకంటే?

Advertisement