#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

,

Lucky Feet : మీ భార్య పాదాలు అలా ఉన్నాయా.. అయితే మీరు చాలా అదృష్టవంతులట..

By Ramesh Babu

Published on: December 5, 2022

Follow Us

palmistry lucky signs in foot for female in telugu

---Advertisement---

Lucky Feet : పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటుంటారు పెద్దలు. అంతలా మన హిందూ సంప్రదాయంలో వివాహానికి తగు ప్రాధాన్యతను ఇస్తారు. వివాహం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి ఎవరూ ఊహించని విధంగా వివాహాలు సమస్యలతో ముడిపడుతూ ఉంటాయి. కానీ కొద్ది మంది జంటలు మాత్రం చాలా హ్యాపీగా గడుపుతారు. ఇలా వీరు హ్యాపీగా గడపడానికి అనేక కారణాలను మన పెద్దలు విశ్లేషిస్తారు. అందులో ఒక కారణం అమ్మాయి పాదాలు అని పెద్దలు చెప్పేస్తారు. పాదాలను బట్టి అబ్బాయిల జాతకాలు మారిపోతాయట.

palmistry lucky signs in foot for female in telugu
palmistry lucky signs in foot for female in telugu

ఈ విషయం నమ్మడానికి కాస్త సమయం తీసుకున్నా కానీ ఇదే నిజం. పాదాల ద్వారా వ్యక్తుల రూపురేఖలు కూడా తెలిసిపోతాయని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాదాలు వెడల్పుగా ఉంటే చాలా ఉత్సాహవంతులని, ఇప్పటికే చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. అంతే కాకుండా పాదంలో మధ్య భాగం వంపు లేకుండా తిన్నగా ఉంటే అలాంటి వారు ఇతరులతో చాలా స్నేహంగా మెదులుతారు. చుట్టూ ఉన్న వారితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. పాదం అడుగు భాగం వంపు తిరిగి ఉంటే వారు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. వారికి ఎటువంటి సమస్యలున్నా సొంతంగానే పరిష్కరించుకునేందుకు ఇష్టపడతారు. ఎవర్నీ చేయి చాచి సహాయం అడగరు.

అంతే కాకుండా ఇటువంటి వారికి జీవితంలో పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. పాదాలు పెద్దగా ఉన్న వారికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సమస్య ఎటువంటిదైనా సరే రెడీగా ఉంటారు. అదీ కాకుండా పాదాలు చిన్నగా ఉన్న వారిలో తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి. మడమలు పగిలి ఉన్న వారిలో నాయకత్వ లక్షణాలు విరివిగా కనిపిస్తాయని పెద్దలు చెబుతారు. ఎవరికైతే బొటన వేలు పొడుగ్గా ఉంటుందో అటువంటి వారు వ్యాపారంలో చురుగ్గా రాణిస్తారని ప్రతీతి. అటువంటి వారు ఇతరులను అనుసరించేందుకు ఎక్కువగా ఇష్టపడరు.

Read Also : Palmistry: అరచేతిలో ఈ రేఖ ఉందంటే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే!

, ,

Join our WhatsApp Channel