Karthika Deepam serial Oct 28 Today Episode : మోనితకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్.. సంతోషంలో వంటలక్క..?

Karthika Deepam serial Oct 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ లో కార్తీక్ దీప ఇద్దరు ఇంద్రుడు తో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జరిగిన విషయాలు తలుచుకొని ఇంద్రుడు జ్వాలమ్మని కన్నకూతురులాగా చూసుకున్నాము. లాంటిది ఇప్పుడు వాళ్ళ అమ్మానాన్నలు వెతుక్కుంటూ వచ్చారు. జ్వాలమ్మ వెళ్లిపోతే చంద్రమ్మ బతకలేదు జ్వాలమ్మను విడిచిపెట్టి ఉండలేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇందులో సారీ జ్వాలమ్మ నన్ను క్షమించు నిన్ను బాధ పెట్టాల్సి వస్తోంది నిన్ను నేను ఎవరికీ ఇవ్వలేను అని ఆటో దగ్గర ఏడుస్తూ దిగాలుగా కూర్చుంటాడు.

Advertisement
Karthika Deepam serial Oct 28 Today Episode
Karthika Deepam serial Oct 28 Today Episode

ఆ తర్వాత కార్తీక్ దీప ఇద్దరు కారులో వెళుతూ ఉండగా అప్పుడు దీప జరిగిన విషయాలు తెలుసుకుని ఆ పాపం మన శౌర్య ఏమో అని నాకు ఆనందంగా ఉంది డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్ అవును అంటూనే ఒకవేళ అక్కడ ఉన్నది నిజంగా శౌర్య అయితే తిరిగి నీకు ఇస్తారు అనుకుంటున్నావా వంటలక్క అని అంటాడు కార్తీక్. అప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు సౌర్య నా కూతురు నా పాప.

Advertisement

Karthika Deepam : శౌర్యను కలుస్తున్నానన్న సంతోషంతో దీప కార్తీక్..

నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని వంటలక్క అంటుంది. అలా వారిద్దరు సౌర్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు మోనిత వాణి ఏమి చేయలేదు అసలు పని చేస్తుందా లేదా అన్న నమ్మకం లేదు అని కావేరి కి ఫోన్ చేసి వాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కావేరి ఏం టెన్షన్ పడకు అది వాణి దాని సంగతి నీకు తెలియదు అని అంటూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే కార్తీక్ అక్కడికి రావడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అనడంతో మా ఫ్రెండ్ కావేరితో అని అంటుంది మోనిత. అప్పుడు కార్తీక్ అనుమానంతో మాట్లాడడంతో నువ్వు వంటలక్కతో బయటకు వెళ్లావు అని నేను ప్రశ్నించక ముందే నన్ను ప్రశ్నిస్తున్నావా అని అంటుంది. మరి నువ్వు అ దుర్గతో జరిగినవన్నీ నేను చూసినవన్నీ అబద్ధాలు అని నువ్వు నిరూపించగలవా అనటంతో పెళ్లి ఫోటో చూపించి ఇదే సాక్ష్యం అని అంటుంది మోనిత.

Advertisement
karthik fires on monitha in todays karthika deepam serial episode
karthik fires on monitha in todays karthika deepam serial episode

ఇప్పుడు కార్తీక్ తన పెళ్లి ఫోటో చూపించి నాకు దీప దగ్గరగా ఉంది ఇది నా పెళ్లి ఫోటో ఉంది. అలా అని నాకు దీపక్ పెళ్లి అయిపోయినట్టేనా అని అంటాడు. అప్పుడు దుర్గా అక్కడికి రావడంతో మేము సీరియస్ గా మాట్లాడుతున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపో దుర్గ అని అంటాడు కార్తీక్. ఇప్పుడు కార్తీక్ ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు. మోనిత ఇంకొకసారి నా జోలికి దీపా జోలికి రావద్దు అని మోనితకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

మరొకవైపు చంద్రమ్మ ఇంద్రుడు రాలేదు అని చూస్తూ ఉండగా ఇంతలోనే ఇంద్రుడు అక్కడికి రావడంతో వచ్చావా అని సంతోష పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు జ్వాలమ్మ ఎలా ఉంది అని అడగడంతో పొద్దున్నుంచి వాళ్ళ అమ్మానాన్న కావాలి అని ఏడుస్తూ ఉంది గండ అని చెప్పడంతో దీప వాళ్ళు ఇచ్చిన ఆ గిఫ్ట్ లను ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రమ్మ వీటిని దొంగతనం చేశావు కదా అని పదే పదే అడగడంతో లేదు అని చెప్పాను కదా అని సీరియస్ అవుతాడు ఇంద్రుడు.

Advertisement
karthik fires on monitha in todays karthika deepam serial episode
karthik fires on monitha in todays karthika deepam serial episode

మరొకవైపు దీప అక్కడ ఉన్నది కదా అనుకోని పిండి వంటలు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇందులో వాని అక్కడికి వచ్చి ఇన్ని పిండి వంటలు ఎందుకు చేస్తున్నావు వదిన నీ అడగగా దీపా సంతోషంతో నా కూతుర్ని చూడడానికి వెళ్తున్నాము తాను పుష్పవతి అయింది అని జరిగిందంతా చెప్పడంతో దుర్గ కూడా స్వీట్లు తీసుకుని వస్తాడు. వారిద్దరి మాటలు విన్న వాణి ఎలా అయినా ఈ విషయం మోనిత చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత మోనిత కు జరిగిన విషయాలను అన్ని చెబుతుంది వాని.

Advertisement

Read Also : Karthika Deepam Oct 26 Today Episode : పుష్పావతి అయిన సౌర్య.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Advertisement
Advertisement