Custard apple side effects : అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం విషయంలోనూ ఇది వర్తిస్తుంది. సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకందాం.
సీతాఫలాలు తినడానికి అమృతం లాగే అనిపించే ఈ పండులో కేవలం రుచిలోనే కాకుండా ఆరోగ్య విషయంలోనూ అద్బుతంగా ఉపయోగపడతాయి. కేవలం సీతాఫలమే కాకుండా ఆ చెట్టు బెరడు, ఆకులు సైతం ఎ్నో ఆయుర్వేద మందుల్లో ఉపయోగపడతాయి. అయితే అతి సర్వత్రా వర్ణయేత్ అన్నట్లు ఏదైనా
అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది.
Custard apple side effects : సీతాఫలం అతిగా తింటే ఆరోగ్య సమస్యలు..
చాలా మందికి సీతాఫలం పడదు. దాన్ని తీసుకోవడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం పండును తీసుకోకపోవడమే మంచిది. అలాగే ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి. రక్తపోటు సమస్యలు ఉన్న వారు సీతాఫలాలను మితంగా తీస్కోవాలి.
దూరం పెడితే మరీ మంచిది. ఇందులోని గుణాలు అకస్మాత్తుగా రక్తపోటును తగ్గిస్తాయి. తద్వారా మైకం, మూర్చ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. సీతాఫలం గింజలు విషపూరితమైనవి. ఇవి చర్మపై ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
Read Also : Amla Benefits : ఉసిరితో ఇన్ని ఉపయోగాలా.. అర్జెంటుగా తినేయండి మరి..