Bandla Ganesh : ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న బండ్ల.. అలా అనేశాడేంటి

Updated on: November 14, 2021

Bandla Ganesh : టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్ పేరు తెలుగు అభిమానులు చాలా మందికి తెలిసే ఉంటుంది. మొన్నటి దాకా రాజకీయాల్లోకి వచ్చి మంగమ్మ శపథాలు చేసి బండ్ల గణేష్ చాలా ఫేమస్ అయ్యాడు. ఈ శపథాల మాట అలా పక్కకుంచితే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల గురించి ఆయన వ్యక్తిత్వం గురించి వరుసగా ట్వీట్లు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుంటారు.

అటువంటి బండ్ల గణేష్ ప్రస్తుతం రూటు మార్చి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీద వరుస ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇంతకీ బండ్ల గణేష్ సడెన్ గా ప్రభాస్ మీద ఎందుకు పడ్డాడని చాలా మంది ఆలోచిస్తుంటారు. మరేం లేదండీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి నేటికి 19 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. వారికి ప్రస్తుతం నిర్మాత బండ్ల గణేష్ కూడా తోడయ్యారు.

ఆయన కూడా ప్రభాస్ అందాన్ని తెగువను పొగుడుతూ వరుస ట్వీట్లు చేసి హీట్ పెంచారు. అమెరికాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని ఎంత తాపత్రయపడతారో.. అలాగే ఇండియాకు వచ్చిన వారు ప్రభాస్ సినిమా చూడాలని ఫీలవుతారంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతే కాకుండా ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్ అది బ్లడ్ లో ఉండాలి అంటూ ట్వీటారు.

Advertisement


Read Also : karthika Deepam Serial : అయ్యోయ్యో వంటలక్క… పరిస్థితి చేయిజారుతోందా? పడిపోతున్న రేటింగ్ దేనికి సంకేతం.. 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel