Ansuya bharaswaj: ఆలియా భట్ గా నిహారిక, దీపికా పదుకొణేగా అనసూయ.. ఎందుకోసమంటే

Ansuya bharaswaj: బుల్లితెర సెలబ్రిటీ యాంకర్ గా సోషల్ మీడియో ఫేమ్ సొంతం చేసుకున్నారు నిఖిల్ విజయేంద్ర సింహ. ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లనూ స్పెషల్ ఇంటర్వ్యూలో చేస్తూ నెటిజెన్లను అలరిస్తోన్న నిఖిల్ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ లోని హోటల్ లో జరుపుకున్నారు. నిహారిక చైతన్య, అనసూయ – భరద్వాజ్ దంపతులతోపాటు పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. పార్టీలో భాగంగా సెలబ్రిటీలందరూ బాలీవుడ్ థఈమ్ ని ఫాలో అయి.. ఫేమస్ చిత్రాల్లో గెటప్స్ ని రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని నిఖిల్ ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. ఇందులో నిహారిక గంగూబాయి కతియావాడిలోని అలియాభట్ లుక్ ని రీ క్రియేట్ ఆమె భర్త చైతన్య అమితాబ్ బచ్చన్ లుక్ లో మెప్పించారు.

ఇక అనసూయ, ఆమె భర్త భరద్వాజ్.. యే జవానీ హై దివానీ లోని దీపికా పదుకొణె, రణ్ బీర్ లుక్స్ లో మెరిశారు. ఇక బర్త్ డే బాయ్ నిఖిల్. రామ్ లీలాలోని రణ్ వీర్ సింగ్ లా, మహాతల్లి, ఫేమ్ జాన్వి.. ఆలియా భట్ లా అదరొగొట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజెన్లును ఆకట్టుకుంటుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel