Big boss season 6: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేస్కున్న ఈ షో.. ఆరో సీజన్ తో దూసుకెళ్తోంది. మూడో వారం బిబ్ బాస్ కంటెస్టెంట్ల రచ్చ మామూలుగా లేదసలు. ఓ వైపు గొడవలు, మరోవైపు ఆటతో ఆగమాగం చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభం అయిన ఈషోలో మొదటి వారం కెప్టెన్ గా బాలాదిత్య గెలవగా… రెండో వారం రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. అయితో మూడో వారం కెప్టెన్సీ పోటీలో ఆదిరెడ్డి గెలిచి అందరినీ షాక్ కు గురి చేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో ఎక్కువగా నామినేషన్ కు గురవుతున్నాడు సింగర్ రేవంత్. ఇందుకు కారణం ఆయన మాటతీరేనని చాలా మంది అంటున్నారు. అతను బిగ్ బాస్ షోలో ప్రవర్తించే విధానం బాగాలేదని అంటున్నారు. ఆయన కావాలనే అలా చేస్తున్నట్లు, అదే ఆటన ఆట తీరని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. మొదట్లో ఇలా రూడ్ గా ప్రవర్తించి రానురాను తన మంచితనం చూపిస్తే.. ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుందని భావించే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి అతడు నిజంగా కావాలనే అలా చేస్తున్నాడా లేదా ఆయన క్యారెక్టర్ యే అంతో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.