Facebook news: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ల సంఖ్య చాలా తక్కువ. తినేందుకు తిండి ఉన్నా లేకున్నా ఫోన్.. సోషల్ మీడియాలో అకౌంట్ కచ్చితంగా ఉండి తీరుతుంది. దూరంగా కూర్చున్నప్పుడు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్ులతో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక గొప్ప మార్గం. అయితే చాలా మంది ఫేస్ బుక్ వాడుతూ ఉంటారు. అయితే ఫేస్ బుక్ లో మనం చాలా సార్లు ఇలాంటి తప్పులు చేస్తుంటాం. అది ఎవరినైనా నేరుగా జైలుకు పంపుతుంది. ఫేస్ బుక్ లో మీరు చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
![Facebook news: ఫేస్ బుక్ వాడుతున్నారా.. అయితే ఈ ఐదు చేయాల్సిందే, లేదంటే జైలుకే! These five tips must follow all the facebook users](https://tufan9.com/wp-content/uploads/2022/09/These-five-tips-must-follow-all-the-facebook-users.jpg)
- ఫేస్ బుక్ లో మనోభావాలు దెబ్బతీసే విషయాలను షేర్ చేయవద్దు. ఇలా చేయడం వల్ల సమాజం మరియు మరీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరి భావాలను దెబ్బతీసేందుకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
- కొత్త సినిమాను పైరసీ చేసి అమ్మడం కూడా నేరమే. ఇలాంటివి చేస్తే… మీరు జైలుకు వెళ్లడం తప్పనిసరి అవుతుంది.
- మతపరమైన మనోభావాలను దెబ్బ తీయవద్దు. అలా చేస్తే అల్లర్లకు దారి తీస్తుంది. మీ స్టేట్ మెంట్ లు లేదా ఫేస్ బుక్ పోస్టుల నుండి అలా జరిగితే పోలీసులు మీపై చర్యలు తీసుకోవచ్చు.
- మీరు ఫేస్ బుక్ లో అమ్మాయికి ఏదైనా తప్పుడు సందేశం, వీడియో మరియు ఫొటో పంపినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ సందేశం గురించి అమ్మాయి ఫిర్యాదు చేస్తే లాకప్ కు వెళ్లాల్సి వస్తుంది.
ఫేస్ బుక్ లో ఎవరికీ బెదిరింపు లేదా అభ్యంతరకరమైన సందేశాలు పంపవద్దు. అలాంటి చరయ్ మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవట్టు.
Advertisement