MLA Vivekananda: సమైక్యతా దినోత్సవాల్లో ఎమ్మెల్యే మాస్ డ్యాన్స్, వీడియో వైరల్!

MLA Vivekananda: కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు పలు విమర్శలకు తావిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నీ తానై తన ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరూ భారీ జన సమీకరణతో విజయవంతం చేయాలని గత కొద్ది రోజుల నుంచి చెప్పుకొచ్చారు. సభా వేదిక ఏర్పాట్లు నుంచి భారీ ర్యాలీ, భోజనం ఏర్పాట్లు, సాంస్కృతిక ఏర్పాట్లు అంటూ నాయకులను ఈరించారు. కానీ తీరా ప్రోగ్రాంకు వచ్చే వరకు తన క్యాడర్ కు సరైన దిశ, నిర్దేశం చేయడంలో సభను సక్సెస్ చేయడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్యక్రమం ముగింపు వరకూ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంగా మారడం, తెలంగాణ చరిత్ర గురించి, నిజాం ప్రబుత్వం భారత్ లో ఎందుకు విలీనం కావాల్సి వచ్చిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేకపోవడంతో కేవలం తీన్మార్ స్టెప్పుల కోసమేనా ఈ సభ అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల వల్లే కుత్బుల్లాపూర్ లో అధికారిక కార్యక్రమాలు అట్టర్ ప్లాప్ గా నిలుస్తున్నాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.

Advertisement

https://youtu.be/T0Q-xbP3MBo

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel