Viral video: హెల్మెట్ తలపై ఉంటే ప్రాణాలు మీ చేతిలో ఉన్నట్లే.. కాదంటారా ఈ వీడియో చూడండి!

Viral video: ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లకు హెల్మెట్, కార్లు నడిపే వాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పదే పదే ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. కానీ జుట్టు చెదిరిపోతుందని, ఉక్కపోస్తుందని, చీర, షర్టు నలిగిపోతాయంటూ వీటిని మన పెడ చెవిన పెడతాం. కానీ ఓ బైకర్ కు హెల్మెట్, కార్లో ఉన్న వ్యక్తి సీట్ బెల్టు ఉంటే దేవుడు మనతోనే ఉన్నట్లే అని అనిపిస్తుంది. కాదని చాలా మంది వాదిస్తుండొచ్చు. కానీ అదే నిజం అండి. అంత నమ్మకం లేకపోతే ఓసారి మీరే ఈ వీడియో చూసేయండి.

రాత్రి సమయంలో ఓ కారు రోడ్డుపై వెళ్తోంది. అదే సమయంలో ఓ బైకర్ స్పీడ్ గా వస్తాడు. అదుపతప్పి రోడ్డుపై పడిపోతాడు. అయితే అతనికి గాయలేమీ కాలేదు. పైకి లేచి నిలబడేంత లోపే మరో ప్రమాదానికి గురవుతాడు. అక్కడే ఉ్న సూచిక బోర్డు కూలిపోయి నేరుగా అతని తలపై పడుతుంది. ఈ రెండు ఘటనల్లో అతని తలే లక్ష్యంగా దెబ్బలు తగిలాయి. అయితే అదృష్ట వశాత్తు బైకర్ హెల్మెట్ ధరించడంతో రెడు ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలతో బయట పడ్డాడు.

Advertisement

Advertisement

అతని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అందుకే ప్రాణాలు దక్కాలంటే హెల్మెట్ తప్పని సరిగా ధరించాల్సిందే. ఈ వీడియో చూశాక అయినా ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరిస్తారని ఆశిస్తూ…

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel