Wife Affair: ప్రస్తుత కాలంలో బంధాలు, బాంధవ్యాలకు విలువ లేకుండా పోతోంది. ఆస్తులు, ఐదు నిమిషాల సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని, భర్త, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులను చంపడం మన తరుచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ఘటనే పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించి పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్న భర్తను… మరో వ్యక్తి మోజులో పడి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని రామగుండంకు చెందిన శ్రావణి భర్త అజింఖాన్ ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు ప్రేమించి పెళ్లి చేస్కున్న అజింఖాన్ ను చంపేందుకు గతంలోనే చాలా సార్లు ప్రయత్నించినట్లు తెలిపింది నిందితురాలు శ్రావణి. అవన్నీ కుదరకపోవడంతో తన తల్లితో కలిసి శ్రావణి.. అజింఖాన్ గొంతు నులిమి, బ్యాట్ తో కొట్టి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.